iDreamPost
android-app
ios-app

పవన్‌కు పిచ్చి పరాకాష్టకు చేరింది.. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయిస్తా : మంత్రి రోజా

పవన్‌కు పిచ్చి పరాకాష్టకు చేరింది.. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయిస్తా : మంత్రి రోజా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం ఓ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రకటించారు. ఈ విషయం అటు టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన నేతలకు మింగుడు పడకపోయినా.. వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో కిమ్మనకుండా ఉండిపోయారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత’ అంటూ ఓ ముఖ్యమంత్రినుద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి రోజా మండిపడ్డారు. షూటింగ్ మధ్యలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పిచ్చి వాగుడు వాగుతున్నారని అన్నారు. ‘పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. ఈ పీకేకు అంటే పిచ్చి కళ్యాణ్ కు అందరూ పిచ్చోళ్లలా కనిపిస్తున్నారు. ప్యాకేజీ కోసం చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని అభిమానుల్ని, కార్యకర్తల్ని, తన సామాజిక వర్గాన్ని మోసం చేశారు. వారందరూ ఛీ కొడుతుంటే ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మా మనస్సున్న ముఖ్యమంత్రిని ఇలా అనడానికి నువ్వెంత, నీ బతుకెంత, నీస్థాయి ఎంత. ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా గెలవని నువ్వు.. మా ముఖ్యమంత్రిని అనేంత గొప్పేడివా’అంటూ ప్రశ్నించారు.

పవన్‌ ఢిల్లీ వెళ్లి బీజెపి పెద్దలతో పొత్తు విషయం మాట్లాడతానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.  ఈ రాష్ట్రం చంద్రబాబు వల్ల రెండు ముక్కలు అయ్యిందని, ఏపీలో దోచిందన్న హైదరాబాద్‌లో దాచుకున్నారని, అది ప్రజల డబ్బు అని, దాన్ని కక్కించి, తిరిగి ప్రజలకు అందిస్తామని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్‌ను నోటికొచ్చినట్లు ఎవరైనా మాట్లాడితే పళ్లు రాలగొడతామని హెచ్చరించారు. ఇద్దరు పిచ్చోళ్లను (లోకేశ్, బాలకృష్ణ) పక్కనపెట్టుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ మీ పిచ్చి పరాకాష్టకు చేరిందని, పవన్ పిచ్చికి జగన్ననతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తామని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నారా వారి కోడలు బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై నారా బ్రాహ్మణిపై కూడా మండిపడ్డారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş