iDreamPost
android-app
ios-app

టీడీపీ కార్యకర్తలు హింసతో పోలింగ్‌ని ఆపాలని చూశారు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలంతా ఉవ్వెత్తున పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈ క్రమంలో సజ్జల కామెంట్స్ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలింగ్ ని ఆపే ప్రయత్నం చేశారని.. హింసతో ఆడవాళ్ళని భయపెట్టాలని చూశారని అన్నారు.

ఏపీ ఎన్నికలు ముగిశాయి. ప్రజలంతా ఉవ్వెత్తున పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈ క్రమంలో సజ్జల కామెంట్స్ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలింగ్ ని ఆపే ప్రయత్నం చేశారని.. హింసతో ఆడవాళ్ళని భయపెట్టాలని చూశారని అన్నారు.

టీడీపీ కార్యకర్తలు హింసతో  పోలింగ్‌ని ఆపాలని చూశారు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. కొన్ని చోట్ల ప్రశాంతంగా ముగిసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ వర్గీయులు పోలింగ్ బూత్ ల దగ్గర రచ్చకు తెరలేపారని.. దాడులకు పాల్పడ్డారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీకే ప్రజల ఆశీస్సులు ఉంటాయన్న విషయం అర్ధమవుతుందని అన్నారు. 2019 నుంచి 2024 వరకూ ఈ ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాల కోసం కృషి చేశారని అన్నారు. మహిళల కోసం, పేదవాళ్ల కోసం.. వారి అభివృద్ధి కోసం వైఎస్ జగన్ పోరాడిన విషయం జనం గుర్తించారని.. అందుకే ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారని అన్నారు.

ఓటింగ్ సరళి చూస్తే ప్రజల ఆశీస్సులు వైసీపీకే ఉన్నాయని స్పష్టమవుతుందని సజ్జల అన్నారు. ముందుగానే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారని.. ఎప్పుడూ లేని విధంగా సానుకూల ఓట్లతో క్యూ కట్టారని అన్నారు. ఓట్లు వేసేందుకు ప్రజలు ఉప్పెనలా పోటెత్తారని.. పోలింగ్ టైం ముగిసినా ఇంకా పోలింగ్ బూత్ ల దగ్గర ఓటర్లు క్యూ లైన్ లో ఉన్నారని అన్నారు. ప్రజల కోసం పాటుపడితే.. ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఉంటాయని జగన్ ఎలా అయితే ఆశించారో.. దానికి తగ్గట్టే ఇవాళ ఓటింగ్ సరళి ఉందని అన్నారు. ఏపీలో 75 శాతం పోలింగ్ నమోదైందని.. ఇంకా క్యూ లైన్ లో అనేక మంది నిలబడి ఉన్నారని.. ఇవాళ ఉప్పెనలా ఓటర్లు క్యూ కట్టారని.. వాళ్ళని చూస్తుంటే వైసీపీనే విజయం వరిస్తుందని.. ఇది ప్రజల విజయమే అవుతుంది అని అన్నారు.

ఇక టీడీపీ నేతలు చేసిన హింసపై కూడా సజ్జల స్పందించారు. చిత్తూరులో టీడీపీ నేతలు ఉదయాన్నే కత్తిపోట్లతో హింసను ప్రారంభించారని.. టీడీపీ కార్యకర్తలు, గూండాలు దాడులకు తెగబడ్డారని అన్నారు. పీలేరు, అద్దంకి, సత్తెనపల్లిలో హింసాకాండ సృష్టించారని అన్నారు. ఓటమి భయంతో తట్టుకోలేక పోలింగ్ ని ఆపాలని ప్రయత్నించారని.. దాడులకు పాల్పడ్డారని.. కర్రలు, కత్తులు, మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని అన్నారు. అయితే ఎంత హింసకు పాల్పడ్డా గానీ మా వైపు నుంచి సంయమనం పాటించామని.. అయితే తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు.

హింసతో మహిళలను భయపెట్టి పోలింగ్ బూత్ ల నుంచి తరిమికొట్టాలని.. ఓట్లు వేయకుండా ఆపాలని చూశారని అన్నారు. రిగ్గింగ్ జరిగిందని.. తెలుగు దేశం పార్టీ నాయకులు రిగ్గింగ్ కి పాల్పడ్డారని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని.. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. సంక్షేమం ద్వారా అభివృద్ధి, ప్రతి పేద కుటుంబ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దారి తీస్తుందని ఏరోజైతే జగన్ యజ్ఞం మొదలుపెట్టారో అదే ఇప్పుడు కొనసాగుతుందని.. ప్రజలు కూడా ఇదే అజెండా ఉండాలని భావించారు కాబట్టే గత ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. అదే ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్ పై ఉంటాయని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి