ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద అనూహ్య ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. అంచనాలు ఉన్నవేమో తుస్సుమంటుంటే కుర్ర హీరోల సినిమాలు ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. కార్తికేయ 2తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కొత్త చిత్రం 18 పేజెస్ ఈ డిసెంబర్ 23 విడుదల కానుంది. సుకుమార్ కథనందించిన ఈ మూవీకి కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అయినప్పటికీ ఎందుకో […]
అండర్ డాగ్ గా బాక్సాఫీస్ బరిలో దిగిన కార్తికేయ 2 సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిఖిల్ దీని మీద ముందు నుంచి ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ అతని అంచనాలకు మించి ఇది పెర్ఫార్మ్ చేయడం ఊహించని పరిణామం. తాజాగా హిందీ డబ్బింగ్ మార్కెట్ టాప్ 10 చోటు దక్కించుకోవడం పట్ల ఈ కుర్ర హీరో ఆనందం మాములుగా లేదు. పెద్ద క్యాస్టింగ్ ఉంటే తప్ప సాధ్యం కానీ 30 కోట్ల మార్క్ ని […]
విడుదలకు ముందు అష్టకష్టాలు పడింది. ఎవరెవరి సినిమాల కోసమో వాయిదా వేసుకుంది. థాంక్ యు కోసం ఒకసారి, మాచర్ల నియోజకవర్గం కోసం ఒక రోజు ఆలస్యంగా ఇలా ఏవో తిప్పలు పడి రిలీజైన కార్తికేయ 2 ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ సాధించే దిశగా పరుగులు పెట్టడం నిఖిల్ లాంటి చిన్న హీరోకు అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. అందులోనూ నార్త్ లో విపరీతమైన గుర్తింపు దక్కడం, లాల్ సింగ్ […]
విడుదల టైంలో సరైన సంఖ్యలో థియేటర్లు దొరక్క హిందీలో లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ ల వల్ల ఇబ్బంది పడ్డ కార్తికేయ 2 ఎట్టకేలకు గొప్ప విజయం నమోదు చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిఖిల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చాలా రీజనబుల్ రేట్లకు బిజినెస్ చేయడంతో బయ్యర్లకు లాభాల పంట పండుతోంది. అటు నార్త్ లోనూ వసూళ్లు బాగా వస్తున్నాయి. ఏడు వేల స్క్రీన్లలో ప్రస్తుతం కార్తికేయ 2 […]
డీజే టిల్లు సినిమా ఎంత పాపులరైందో మనకు తెలుసు. టిల్లుగా చేసిన సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, మాట, యాక్షన్ కు ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ వచ్చింది. ఇక టిల్లును కష్టాల్లోకి పడేసిన రాధిక పాత్ర కూడా అంతే ప్రజాదరణ పొందింది. అయితే డీజే టిల్లు పార్ట్ 2లో రాధిక పాత్ర ఉండబోదనే వార్తలు సైతం వస్తున్నాయి. వాస్తవానికి కథలో రాధిక పాత్రను ముగిస్తూ మరో కొత్త పాత్రను తెరపైకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. ఆ కొత్త పాత్రను పోషించే […]
విడుదల విషయంలో ఎన్నో అవాంతరాలు ఎదురుకుని వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఎన్నో ఒత్తిళ్లను భరించి చివరికి థియేటర్లను ఇవ్వమని బెదిరించినా సరే వెనక్కు తగ్గకుండా శనివారం విడుదలకు రిస్క్ చేసి మరీ సిద్ధపడిన కార్తికేయ 2కి ఆశించిన దానికన్నా గొప్ప ఫలితమే దక్కుతోంది. మాచర్ల నియోజకవర్గంకు డిజాస్టర్ టాక్ రావడంతో బింబిసార, సీతారామం చూసేసిన ప్రేక్షకులు యునానిమస్ గా తమ ఓటుని నిఖిల్ కే వేస్తున్నారు. నార్త్ లో చాలా తక్కువ స్క్రీన్లు ఇచ్చినప్పటికీ టాక్ పాజిటివ్ […]
కార్తికేయ 2 సినిమా చూసిన వాళ్ళకు నిఖిల్ తో పాటు సమానంగా ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించిన అనుపమ కూడా కచ్చితంగా గుర్తుండిపోతుంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటవ్ టాక్ ను సొంతం చేసుకొని నార్త్ లోనూ స్క్రీన్స్ పెంచుకోవడం నిజంగా శుభపరిణామం. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. కార్తికేయ 2 సినిమాలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై చాలా సంతోషంగా ఉంది అనుపమ. ఈ స్పందన తనకు […]
కొన్నేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా టైటిల్ కు రెండు నెంబర్ జోడించి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఎందరో హీరోలు దర్శకులు బాక్సాఫీస్ వద్ద షాకులు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మన్మథుడు 2, సత్య 2, కిక్ 2 లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందుకే కార్తికేయ 2ని అనౌన్స్ చేసినప్పుడు ఈ టాలీవుడ్ నెగటివ్ ట్రెండ్ ని బ్రేక్ చేస్తుందా అనే అనుమానాలు [లేకపోలేదు. విడుదల కోసం నానా పురిటి […]
విడుదలకు సిద్ధమైనప్పటి నుంచి కార్తికేయ 2 పడుతున్న కష్టాలు చూస్తూనే ఉన్నాం. హీరో నిఖిల్ స్వయంగా తనకు కన్నీరు వచ్చినంత పనైందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో మలుపు వచ్చి పడింది. ముందు చెప్పినట్టు ఆగస్ట్ 12 కాకుండా ఒక రోజు ఆలస్యంగా 13న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. థియేటర్ కౌంట్ విషయంలో తలెత్తిన పలు ఇబ్బందులతో పాటు ఒక […]