Tirupathi Rao
Anupama Parada Movie Concept Video: అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కు బ్యాక్ బ్యాక్ డబుల్ ధమాకా ఆఫర్స్ వచ్చేశాయి. టిల్లు స్క్వేర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిందో లేదో.. అనుపమ మరో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ తో వచ్చేసింది.
Anupama Parada Movie Concept Video: అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కు బ్యాక్ బ్యాక్ డబుల్ ధమాకా ఆఫర్స్ వచ్చేశాయి. టిల్లు స్క్వేర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిందో లేదో.. అనుపమ మరో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ తో వచ్చేసింది.
Tirupathi Rao
అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఈ పేరు మారు మోగుతోంది. ఎందుకంటే అనుపన లిల్లీగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో అనుపమ చాలా కొత్తగా కనిపించింది. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలకు సంబంధం లేకుండా కాస్త బోల్డ్ క్యారెక్టర్ ఎంచుకుంది. ఆ క్యారెక్టర్ కి నూటికి నూరు శాతం న్యాయం కూడా చేసింది. అయితే ఈ మూవీతో అనుపమపై చాలా విమర్శలు వచ్చాయి. ఒక్కసారిగా ఇలాంటి పాత్ర ఎందుకు ఎంచుకున్నారంటూ పెదవి విరిచారు. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ తన తర్వాత మూవీ కాన్సెప్ట్ వీడియో విడుదల చేసింది ఈ అమ్మడు.
ఆనంద మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం లేడీ మల్టీస్టారర్ మూవీ. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మాత్రమే కాకుండా.. జయ జయ జయహే ఫేమ్ దర్శనా రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కూడా ఈ మూవీలో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సమంత రూత్ ప్రభు, రాజ్ అండ్ డీకే ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. అలాగే ఈ మూవీ పేరు ‘పరదా’ అని రివీల్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడమే కాకుండా.. ఆలోచింపజేస్తోంది కూడా. ఈ మూవీ కాన్సెప్ట్ ని దాదాపుగా చెప్పేశారు. ప్రేమ పేరుతో అమ్మాయిలకు ఎదురయ్యే ఆంక్షలు, ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందంటూ చెప్తున్నారు.
కాన్సెప్ట్ వీడియోలో శ్రీశ్రీ జ్వాలకంటాదేవి దివ్యజ్యోతిని చూపించారు. ఆ తర్వాత అమ్మవారి ముఖాన్ని కప్పేశారు. ఆ విగ్రహం ముందు స్త్రీలు నెత్తిమీద బిందెలతో నిల్చుని ఉన్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ చుట్టూ ఉండే మహిళలకు పరదాలు వేసి ఉంటాయి. వారిని చూపించిన తర్వాత అనుపమ ముఖానికి ఉన్న పరదాని తొలగిస్తారు. అయితే ఈ వీడియోలో దర్శన రామచంద్రన్, సంగీత ముఖాలను అయితే రివీల్ చేయలేదు. తర్వాత వచ్చే అప్ డేట్స్ లో చూపించే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కాన్సెప్ట్ వీడియోకి అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది.
ఈ కాన్సెప్ట్ వీడియో బ్యాగ్రౌండ్ లో “యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” శ్లోకం రిపీటెడ్ గా వినిపిస్తూ ఉంటుంది. కాన్సెప్ట్ అయితే లౌడ్ అండ్ క్లియర్ గా ఉంది. లేడీ ఓరియంటెడ్, సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దౌర్జన్యం, దారుణాలు, ఆంక్షలు నేపథ్యంలో ఉంటుందని. అలాగే బోల్డ్ క్యారెక్టర్స్ విమర్శలు, కామెంట్లకు అనుపమ పరమేశ్వరన్ అయితే చెక్ పెట్టేసింది. ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. మరి పరదా కాన్సెప్ట్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.