iDreamPost
android-app
ios-app

అనుపమ అదిరే ఆఫర్‌.. అది తెచ్చిచ్చిన వారిని పెళ్లి చేసుకుంటుందట

  • Published Feb 28, 2024 | 5:38 PM Updated Updated Feb 28, 2024 | 5:38 PM

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ నుండి వచ్చిన మరో అందం ఆమె. తొలి సినిమాతోనే తన బుట్టలో పడేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. అంతేకాదూ.. అభిమానులకు అదిరే ఆఫర్ ప్రకటించింది

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ నుండి వచ్చిన మరో అందం ఆమె. తొలి సినిమాతోనే తన బుట్టలో పడేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. అంతేకాదూ.. అభిమానులకు అదిరే ఆఫర్ ప్రకటించింది

  • Published Feb 28, 2024 | 5:38 PMUpdated Feb 28, 2024 | 5:38 PM
అనుపమ అదిరే ఆఫర్‌.. అది తెచ్చిచ్చిన వారిని పెళ్లి చేసుకుంటుందట

ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఒకప్పుడు పక్కింటి అమ్మాయిగా, అందమైన కట్టుబొట్టుతో కనిపించే అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. సాంప్రదాయంగా కనిపిస్తే.. అవకాశాలు రావనుకుందో లేక.. ఇతర కారణాలో తెలియదు కానీ..హాట్ హాట్ గా కనిపిస్తుంది. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లో అనుపమ విశ్వ రూపం చూసి.. ఓ అభిమాని ఆవేదన వెళ్ల గక్కిన సంగతి విదితమే. ఒకప్పటి సావిత్రి, సౌందర్యలా పద్దతిగా ఉన్నారనుకుంటే ఇలా మారిపోయారేంటండీ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ వీడియో వైరల్ కూడా అయ్యింది. సోషల్ మీడియాలో కూడా అమ్మడు రచ్చ లేపుతోంది. మారిషస్‌లో ఆమె ఇచ్చిన ఫోజులకు.. సోషల్ మీడియా కూడా షేక్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు అభిమానులకు ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చింది ఈ మలయాళ ముద్దుగమ్మ. ఇన్ స్టా స్టోరీ వేదికగా.. ఓ వీడియో పంచుకుని.. ఇది తీసుకు వస్తే.. నేను మీ సొంతం అంటూ ఓ భారీ బొనాంజానే ప్రకటించింది. బేబీ హిప్సో వీడియోను తన ఇన్ స్టాలో స్టోరీలో పోస్టు చేసిన అనుపమ ‘దీన్ని గిఫ్టుగా ఇస్తే.. నేను మీ సొంతం’ అంటూ రాసుకొచ్చింది. కాగా, అందులో ఆ బేబి హిప్పో చాలా ముద్దుగా కనిపిస్తుంది. దీనిపై మనస్సు పారేసుకున్న ఈ ఉంగరాల జుట్టు హీరోయిన్.. అది కావాలంటూ మారాం చేస్తూనే.. తీసుకువచ్చి.. తనకు గిఫ్టు ఇచ్చిన వారికి పెళ్లి చేసుకుంటా అంటూ ప్రకటించేసింది. మరీ ఎవరైనా ఇస్తారేమో చూడాలి.  ఇక సినిమా విషయానికి వస్తే.. తమిళంలో వచ్చిన సైరన్ మూవీలో నటించింది అమ్మడు. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక తెలుగులో గ్లామరస్ పాత్రలో కనిపించిన టిల్లు స్క్వేర్ వచ్చే నెల 29న విడుదల కానుంది. అఆ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, కృష్ణార్జున యుద్దం, తేజ్ ఐలవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, ఉన్నది ఒకటే జిందగీ, కార్తీకేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజెస్, బటర్ ఫ్లై వరకు చాలా పద్దతిగా కనిపించింది. అయితే ఇప్పటి వరకు టైర్ 2 హీరోలతో జతకట్టిన అమ్మడికి.. టాప్ హీరోలతో నటించే అవకాశం రాలేదు. దీంతో ఆమె గ్లామర్ డోసు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ట్రెండుకు తగ్గట్లు మారిపోయింది. రవితేజతో ఈగల్‌లో ఆడిపాడిన ఈ బ్యూటీ.. సిద్దుతో రచ్చ లేపేందుకు రాబోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. చూడాలి టిల్లు తర్వాత.. ఎలాంటి ఆఫర్లు వస్తాయో..

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş