iDreamPost
android-app
ios-app

బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి కారణం అదే.. అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Mar 19, 2024 | 9:29 AM Updated Updated Mar 19, 2024 | 9:29 AM

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ సినిమాతో మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధంగా ఉాంది అనుపమ పరమేశ్వరన్. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ పెట్టిన ప్రెస్ మీట్ లో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వెనుక కారణం అదే అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ సినిమాతో మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధంగా ఉాంది అనుపమ పరమేశ్వరన్. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ పెట్టిన ప్రెస్ మీట్ లో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వెనుక కారణం అదే అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

  • Published Mar 19, 2024 | 9:29 AMUpdated Mar 19, 2024 | 9:29 AM
బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి కారణం అదే.. అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు మొదట ఎంతో పద్ధతిగా పాత్రకు తగ్గట్టుగా నటిస్తుంటారు. ఇక ఆ పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకలును ఆకట్టుకుంటారు. కానీ ఉన్నట్టుండి కొన్ని రోజుల తర్వతా.. ఫుల్ గ్లామరెస్ పాత్రలు చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తుంటారు. ఒకనొక సమయంలో మన ఫెవరెట్ హీరోయినేన అనేలా మారిపోతారు. అలాంటి వారిలో మన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ఎందుకంటే.. ఈ బ్యూటీ మొదట అఆ, శతమానం భవతి, తదితర చిత్రాల్లో కుందనపు బొమ్మలా కనిపించేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆమె ఎంచుకుంటున్న పాత్రలు చూసి ఆమె అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆమె నటించిన టిల్లు స్కేర్ లో అయితే గ్లామరెస్ లుక్స్ లో రెచ్చిపోయిందనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుంది కాబట్టి, ప్రస్తుతం చిత్రం బృందం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే తాజాగా ఈ సినిమాలో ఓ మై లిల్లీ అనే పాటను రిలీజ్ చేయడంతో.. చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అందులో అనుపమ ఈ సినిమాలో ఇలా బోల్డ్ గా ఎందుకు నటించాల్సి వచ్చిందనే విషయాన్ని బయటపెట్టింది.

సిద్ధూ జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కనుక ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. కాగా, నిన్న ఈ సినిమాలో ‘ఓ మై లిల్లీ’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ఆన్సర్స్‌కి రిపోర్టర్లకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎప్పుడూ లేనంతగా ఈ చిత్రంలో బోల్డ్ రోల్‌లో కనిపించారు కదా.. కారణమేంటి? అని అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగి పోయే ఆన్సర్ ఇచ్చింది అనుపమ. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ‘యాక్టర్ గా ఇన్నేళ్లలో చేసిన క్యారెక్టర్స్ మళ్లీ మళ్లీ చేస్తుంటే బోర్ కొడుతుంది. ఈ మూవీలో లిల్లీ పాత్ర వదులుకోవడం అనేది పిచ్చి పని అవుతుంది.ఎందుకంటే.. ఒక కమర్షియల్ సినిమాలో అమ్మాయికి ఇంత మంచి పాత్ర దొరకదు. అందుకే అలాంటి మంచి క్యారెక్టర్‌ను నేను వదులుకోవాలని అనుకోలేదు. ఎన్ని లిమిటేషన్స్ ఉన్నా ఒక యాక్టర్‌గా నేను యాక్ట్ చేయడం నా డ్యూటీ. డైరెక్టర్ ఇచ్చిన పాత్రను 100 శాతం నేను చేయాలి. అది చేయడానికి నేను ట్రై చేశాను’ అని చెప్పుకొచ్చింది.

ఇక ఈ ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా మరొక రిపోర్టర్ మళ్లీ అలాంటి ప్రశ్నే అడగడంతో ఈసారి అనుపమ గట్టి కౌంటర్ ఇచ్చింది . ‘మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. కానీ, ప్రతి రోజూ ఇంట్లో బిర్యానీ తింటారా? లేదు కదా అలానే నేను కూడా ప్రతి రోజూ బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు కూడా డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి అన్నీ కావాలి’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ కామెంట్స్ అనేవి తెగ వైరల్ అవుతున్నాయి. మరి, అనుపమ ఇలాంటి సినిమాలో నటించడానికి చెప్పిన కారణం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetJojobet girişjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin