iDreamPost
android-app
ios-app

టిల్లు స్క్వేర్ కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ.. అన్ని కోట్లా?

  • Published Feb 21, 2024 | 3:20 PM Updated Updated Feb 21, 2024 | 3:49 PM

Anupama Remuneration For Tillu Square: అనుపమ క్రేజ్ సౌత్ లో మరోసారి మారు మోగుతోంది. టిల్లు స్క్వేర్ సినిమాతో ఆమె కెరీర్ మరోసారి పరుగులు పెడుతుంది అంటున్నారు.

Anupama Remuneration For Tillu Square: అనుపమ క్రేజ్ సౌత్ లో మరోసారి మారు మోగుతోంది. టిల్లు స్క్వేర్ సినిమాతో ఆమె కెరీర్ మరోసారి పరుగులు పెడుతుంది అంటున్నారు.

  • Published Feb 21, 2024 | 3:20 PMUpdated Feb 21, 2024 | 3:49 PM
టిల్లు స్క్వేర్ కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ.. అన్ని కోట్లా?

అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. టిల్లు స్క్వేర్ లో ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై హైప్ బాగా పెరిగిపోయింది. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కావడం, ట్రైలర్ కూడా అదిరిపోవడంపై అందరూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ కు సౌత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రల్లో మెప్పించింది. ఎక్కడా కూడా గీత దాటకుండా.. తనకంటూ కొన్ని షరతులు పెట్టుకుని పాత్రలు చేస్తూ వచ్చింది. కానీ, ఫర్ ది ఫస్ట్ టైమ్ అనుపమ ఆ హద్దులను చెరిపేసింది. టిల్లు స్క్వేర్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేశాయి. కొందరు ఈ మూవీలో అనుపమ పాత్ర గురించి ఎగ్జైటెడ్ గా ఉంటే.. అభిమానులు మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుపమ ఇలాంటి పాత్రలు చేయద్దంటూ ఫ్యాన్స్ వీడియోల్లో రిక్వెస్టులు పెట్టడం కూడా చూశాం.

ఏది ఏమైనా.. అనుపమ మాత్రం ఇలాంటి పాత్రలకు పచ్చ జెండా ఊపేసింది. కానీ, రెమ్యునరేషన్ మాత్రం పెంచేసింది అని చెబుతున్నారు. సాధారణంగా అనుపమ ఇప్పటివరకు టాలీవుడ్ లో సినిమాలకు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు పారితోషకం అందుకునేదంట. కానీ, ఇప్పుడు ఈ టిల్లు స్క్వేర్ కి మాత్రం రూ.2 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి.. ఆ పారితోషకం ఈ ఒక్క మూవీ వరకేనా.. ఇదే కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి అనుపమ పరమేశ్వరన్ రెమ్యూనరేషన్ మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంక ఈ టిల్లు స్క్వేర్ మూవీ విషయానికి వస్తే.. ట్రైలర్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొదటి నుంచి మూవీ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అందరికీ క్లారిటీ ఉంది. కానీ, అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్నీ డబుల్ ధమాకా అనే చెప్పాలి. సిద్ధు కూడా అదే విషయాన్ని కన్ఫామ్ చేశాడు. ఇంక ఈ మూవీపై ఉన్న హైప్ కి తగ్గట్లు ఓటీటీ రైట్స్ కూడా రూ.35 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ మూవీకి ఆ రేంజ్ డిమాండ్ అంటే అందరూ ఒకింత షాకవుతున్నారు కూడా. మరి.. టిల్లు స్క్వేర్ కోసం అనుపమ రూ.2 కోట్లు ఛార్జ్ చేసిందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet