iDreamPost
android-app
ios-app

Anupama Parameswaran: అనుపమపై పిచ్చి రాతలు! తాను సీరియస్ గా హార్ట్ అయ్యింది!

  • Published Mar 28, 2024 | 11:45 AM Updated Updated Mar 28, 2024 | 11:45 AM

టిల్లు స్క్వేర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మూవీ యూనిట్ మెుత్తం ఈ వేడుకకు హాజరైయ్యారు. కానీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఈ ఫంక్షన్ కు రాలేదు. దానికి గల కారణాలను సిద్దూ జొన్నలగడ్డ వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టిల్లు స్క్వేర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మూవీ యూనిట్ మెుత్తం ఈ వేడుకకు హాజరైయ్యారు. కానీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఈ ఫంక్షన్ కు రాలేదు. దానికి గల కారణాలను సిద్దూ జొన్నలగడ్డ వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Mar 28, 2024 | 11:45 AMUpdated Mar 28, 2024 | 11:45 AM
Anupama Parameswaran: అనుపమపై పిచ్చి రాతలు! తాను సీరియస్ గా హార్ట్ అయ్యింది!

అనుపమ పరమేశ్వరన్.. ఎప్పుడైతే ‘టిల్లు స్వ్కేర్’ సినిమాలో చేస్తుందని తెలిసిందో అప్పటి నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి అనుపమపై ఆమె ఫ్యాన్సే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్వ్కేర్ లో ఇంత బోల్డ్ గా నటించడానికి కారణాలు ఏంటని ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే దానికి రీజన్ కూడా చెప్పి క్లారిటీ ఇచ్చింది అనుపమ. కానీ ఆమెపై ట్రోల్స్ మాత్రం ఆగలేదు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుపమ రాలేదు. దానికి పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హీరో, హీరోయిన్స్ అన్నాక ఎలాంటి పాత్రలైనా చేయాలి. కేవలం ఇలాంటి పాత్రలే చేస్తాం అని గిరి గీసుకుని ఉంటే వారి కెరీర్ క్లోజ్ అయినట్లే. ఈ విషయం చాలా మంది నటీ, నటులకు తెలుసు. అయితే హీరోల కంటే.. హీరోయిన్స్ వేసే రోల్స్ విషయంలో కొన్ని ఆంక్షలు విధిస్తారు నెటిజన్లు. ఇలా నటించాలి, అలాంటి పాత్రలే చేయాలి, బోల్డ్ క్యారెక్టర్లు చేయకూడదు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి పొజిషన్ లోనే ఉంది స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

Tillu square

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేసింది అనుపమ. ఆమెను అలా బోల్డ్ గా చూడలేకపోయిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ఇలాంటి పాత్ర చేయడానికి కారణం కూడా చెప్పింది ఈ బ్యూటి. కానీ ఫ్యాన్స్ లో మాత్రం కోపం చల్లారలేదు. ఇలాంటి టైమ్ లో ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన పోస్టర్ పెద్ద వివాదాన్నే రాజేసింది. ఈ పోస్టర్ పై వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హర్ట్ అయిన అనుపమ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాలేదు. దీంతో ఆమెకు అండగా నిలిచాడు సిద్దు. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు కాస్త ముందూ వెనకా చూసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు. పైగా మనం కామెంట్ చేసేది ఓ అమ్మాయి గురించి అని మర్చిపోవద్దని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేసిన తొలి హీరోయిన్ అనుపమ కాదు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కథకు అనుగునంగా ఇలాంటి పాత్రల్లో మెరిసినవారే. కానీ ఒక్క అనుపమనే ఎందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు? రొమాంటి సీన్లపై ఇంత రచ్చ దేనికి? అంటూ మరికొందరు ఆమెకు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఒక అమ్మాయిని గౌరవించేది ఈ విధంగానేనా? అంటూ విమర్శించే వారికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకంటే ఘాటైన పోస్టర్లు ఎన్నో వచ్చాయి, వాటిపై ఇంత రాద్దాంతం ఎందుకు చేయలేదు? కేవలం అనుపమనే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? ఓసారి ఆలోచించుకోవాలి. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కాగా.. తనపై రాసిన పిచ్చి రాతలు, విమర్శల కారణంగానే బాధపడి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుపమ రాలేదని సిద్దు తెలిపాడు. ఇకపోతే.. టిల్లు స్వ్కేర్ మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి అనుపమపై వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: స్నేహం కోసం రామ్ చరణ్ ఇంత చేస్తాడా? నిమిషంలో రూ.5 లక్షలు! మనోజ్ బయటపెట్టిన నిజం!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet