iDreamPost
android-app
ios-app

ఓ మహిళ ఫోటో షేర్ చేస్తూ విషెష్ చెప్పిన అనుపమ.. ఆమె ఎవరో తెలుసా!

  • Published Apr 04, 2024 | 4:16 PM Updated Updated Apr 04, 2024 | 4:16 PM

Anupama Parameswaran: తెలుగు యువకుల ఆరాధ్య దేవత అనుపమ పరమేశ్వరన్. అఆ తో టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చిన ఈ కేరళకుట్టికి అతి తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షేర్ చేసింది.

Anupama Parameswaran: తెలుగు యువకుల ఆరాధ్య దేవత అనుపమ పరమేశ్వరన్. అఆ తో టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చిన ఈ కేరళకుట్టికి అతి తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షేర్ చేసింది.

  • Published Apr 04, 2024 | 4:16 PMUpdated Apr 04, 2024 | 4:16 PM
ఓ మహిళ ఫోటో షేర్ చేస్తూ విషెష్ చెప్పిన అనుపమ.. ఆమె ఎవరో తెలుసా!

సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక.. అనేక రకాల పోస్టులు మన ముందు దర్శనం ఇస్తున్నాయి. అలాంటి వాటిల్లో సెలబ్రిటీలకు సంబంధించిన అంశాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలానే సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. ఓ ఫోటోను షేర్ చేస్తూ అందులోని వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఎవరా అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అనుపమ పరమేశ్వరన్ ..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది.  మన పక్కింటి అమ్మాయిలా సరదాగా తెలుగు వారిలో కలిసిపోయింది ఈ కేరళ కుట్టీ. ‘ప్రేమమ్’ సినిమాతో వెండి పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే తెలుగువారి మనస్సును గెల్చుకుంది.  ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ తెరకెక్కించిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటిస్తూ అందరిని ఆకట్టుకుంది. తన అంద చందాలతో కుర్రాళ్ల గుండెల్లో అనుపమ గుడి కట్టుకుంది. కార్తికేయ-2 సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమాను చూసిన వారందరూ లిల్లీ పాప దుమ్మురేపింది  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమ్మడు కాస్తా అందాలను ఆరబోసిందనే సినీ ప్రియులు అభిప్రాయా పడుతున్నారు. టిల్లుతో లిల్లి సూపర్ అంటూ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో కూడా అనుపమ యాక్టీవ్ గా ఉంటారు. ఈ అమ్మడు తనకు సంబంధించిన ఏ పోస్ట్ చేసినా యూత్ క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అలానే ఇటీవలే తన తమ్ముడిని హగ్ చేసుకున్న ఫోటోస్ ఈ బ్యూటీ షేర్ చేసింది. తాజాగా తన తల్లికి బర్త్ డే విషెష్ తెలుపుతూ తల్లి సునీతతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇక అనుపమ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే అత్తమ్మా..నీ కూతురు జాగ్రత్త అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ అక్కా చెల్లెల్లుగా కనిపిస్తున్నారంటున్నారు. తన బలం అమ్మే అంటూ అనుపమ అప్పుడప్పుడు సునీతను ఆటపట్టిస్తుంది. ఒక్కోసారి పలు కార్టూన్స్ తో తన తల్లి గురించి చెబుతూ పోస్ట్ వేసి అందరినీ నవ్వించేస్తోంది. టిల్లు స్క్వేర్  హిట్ తో ఎంజాయ్ చేస్తున్న అనుపమకు నేడు తన అమ్మగారి పుట్టిన రోజు కావడంతో తన ఆనందం డబుల్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss