iDreamPost
android-app
ios-app

టిల్లు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టిల్లు స్క్వేర్ లో రాధికా అక్క కూడా..!

  • Published Feb 24, 2024 | 7:06 PM Updated Updated Feb 24, 2024 | 7:06 PM

Neha Shetty In Tillu Square: డీజే టిల్లులో రాధికా పాత్రకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో కూడా రాధికా కావాలి అంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.

Neha Shetty In Tillu Square: డీజే టిల్లులో రాధికా పాత్రకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో కూడా రాధికా కావాలి అంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.

  • Published Feb 24, 2024 | 7:06 PMUpdated Feb 24, 2024 | 7:06 PM
టిల్లు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టిల్లు స్క్వేర్ లో రాధికా అక్క కూడా..!

టిల్లు స్క్వేర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో యువత అంతా ఈ మూవీ గురించే తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎందుకంటే డీజే టిల్లు వాళ్లకు ఎక్కించిన హైప్ అలాంటిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ మూవీపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. టిల్లు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తాడా అంటూ ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. అయితే మార్చి 29న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో మ్యాడ్ ఎక్కించడానికి టిల్లు రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి బుర్ర గిర్రున తిరిగే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ న్యూస్ విన్న తర్వాత ఫ్యాన్స్ మొత్తం అబ్బా అన్నా ఏమన్నా ప్లాన్ చేశావా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

విషయం ఏంటంటే.. డీజే టిల్లు సినిమా అంత పెద్ద హిట్టు కావడంలో రాధికా పాత్ర కూడా ఉంది. అసలే సినిమా ప్లాటే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు సీక్వెల్ లో పాత్రను పరిచయం చేయకపోయినా.. పేరును మాత్రం విచ్చలవిడిగా వాడేస్తున్నారు. టిల్లు చెప్పే నాలుగు డైలాగుల్లో మూడింట రాధికా పేరు రిఫరెన్స్ ఉంటుంది. పెళ్లి, ప్రేమ, అమ్మాయి ఇలా టాపిక్ ఏదైనా కూడా రాధికా పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత టిల్లు స్క్వేర్ లో రాధికా కూడా ఉంటే బాగుటుంది అనే అభిప్రాయాలు, డిమాండ్లు బాగా వినిపించాయి.

గెస్ట్ రోల్ అయినా రాధికాని తీసుకొస్తే బాగుంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేకర్స్ కూడా రాధికా పాత్రను పక్కన పెట్టాలి అనే ఆలోచనలో లేరనే విషయం తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ లో కూడా రాధికా ఉంటుందని తెలుస్తోంది. సీక్వెల్ లో రాధికా అక్క క్యామియో ఉంటుందని చెబుతున్నారు. మొత్తం 15 నిమిషాల పాటు టిల్లు- రాధికాకి మ్యాడ్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం అందుతోంది. టిల్లు స్క్వేర్ లో కూడా రాధికా ఉంటుందని తెలుసుకుని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంక అనుపమ పాత్ర.. రాధికా క్యారెక్టర్ ని మించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పార్ట్ 1తో పోలిస్తే.. సీక్వెల్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్నీ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగే ఉన్నాయి. ఇప్పటికే టిల్లు స్క్వేర్ మూవీపై యువతలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మార్చి 29న రిలీజ్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అలాగే మూవీకి సంబంధించి హైప్ ని మరింత పెంచేలా.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ని ఏకంగా రూ.35 కోట్లకు కొనుగోలు చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మూవీపై ఎంత నమ్మకం, ఎంత హైప్ లేకపోతో ఆ ధర ఇస్తారు అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో టిల్లు స్క్వేర్ బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. టిల్లు స్క్వేర్ లో రాధికా కూడా ఉండబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss