ఏలూరులో వింత వ్యాధికి కారణాలు ఎట్టకేలకు వెలుగులోకొచ్చాయి. దాదాపు 14 బృందాలు ఈ వ్యాధికిసంబంధించిన మూలాలను కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన విషయం విదితమే. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి జారుగుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అటెన్షన్‌ను క్రియేట్ చేసిందీ ఘటన. దీంతో ఏలూరు ఒక్కసారిగా జాతీయ వార్తాకథనాల్లో భాగమైపోయింది. అయితే ఎయిమ్స్ బృందం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్, ఎన్ఈఈఆర్ఐ తదితర సంస్థలు ఇచ్చిన నివేదికల్లో బాధితుల్లో […]
ఏపీలో ఇప్పటి వరకు ఉన్న స్థితికంటే ఉన్నత స్థితికి చేరుకోవాలన్న ఆరాటం బీజేపీలో ఎక్కువైపోయింది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలను ఎంత వీలైతే అంతగా వినియోగించ నిర్ణయించుకుంది. ఇందుకు ముందుగానే జనసేన పొత్తును ఓం ప్రథంగా చెబుతారు. ఆ తరువాత కూడా ఇదే విధమైన ఆలోచనా ధోరణిని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ప్రకటనల ద్వారా వెలిబుచ్చుతున్నారు. ప్రజాధరణ ఎక్కువగా ఉన్న అధికార వైఎస్సార్సీపీని విమర్శించడం ద్వారా తాము బావుకునేదేమీ లేదన్నది గుర్తించి, ప్రతిపక్షంలో ఉన్న […]
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న భారీ నిరసనకు మద్ధతుగా నేడు జరుగుతోన్న భారత్ బంద్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. భారత్ బంద్‌కు రైతులు ఇచ్చిన పిలుపునకు స్పందించిన అన్ని పక్షాలు మద్ధతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతులకు మద్ధతుగా నిలిచింది. బంద్‌కు సంపూర్ణంగా సహకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు […]
వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులతో వరుసగా ముప్పులు ముంచుకొస్తున్నాయి. నెల రోజుల క్రితం వరకు ఏకధాటిగా వర్షాలు మోతెట్టేసాయి. ఇప్పుడు నివర్ తుఫాను తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈనెల 29, డిసెంబర్ 2, 7 తేదీల్లో వరుసగా తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ అంచనాలు కడుతోంది. బంగాళాఖాతాలో 29వ తేదీన ఏర్పడనన్న అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం నివర్ తుఫాను ప్రభావం చూపిన ప్రాంతంలోనే ఇవి కూడా ప్రభావం చూపేందుకు అవకాశం ఉంటుందని […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ఘోరాలు జరిగిపోతాయి.. నేరాలు పెరిగిపోతాయి.. అంటూ ప్రతిపక్షాలు ఒక్కటే ఊదరగొట్టాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అరాచకాలు జరుగుతాయంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్రైం రికార్డు బ్యూరో తాజాగా వెల్లడించిన రిపోర్టు వాళ్లందరికీ కళ్లు బైర్లు కమ్మేళా చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు. సుమారు 18% నేరాలు తగ్గినట్లు ఆ రిపోర్టు చెబుతోంది. ఐపీసీ నేరాలలో 3.7% తగ్గుదల నమోదైంది. హత్య కేసులు 7% తగ్గాయి. ఇందుకు సీఎం జగన్మోహన్ […]
ముసురు.. ఈ మాట విని పదేళ్లు దాటింది. ఎప్పుడో 2010కి ముందు ఈ మాట ఆంధ్రప్రదేశ్‌లో వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. ఈ మధ్యలో పదేళ్లలో ముసురు కాదు కదా వరుణుడి జాడ కనిపించడమే గగనమైంది. చాలీచాలనీ వర్షాలు, కరువుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. గొడ్డు, గొదకు అవసరమైన నీళ్లు కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. భూగర్భజలాలు అడగంటిపోయాయి. 500 అడుగుల లోతు బోర్లు […]
కరోనా కష్ట కాలంలో ఆంద్రప్రదేశ్ ప్రజలకు భారీ ఉపశమనం కలిగేలా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటతే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు చేయడం మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతోన్న ఈ పథకం ఈ నెల 16వ తేదీ నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. వైద్యం […]
కరోనా వైరస్ కట్టడిలో అధికారుల నిర్లక్ష్యం భారీ నష్టానికి దారి తీసింది. భారీ సంఖ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 27 వేల కరోన పరీక్ష నమూనాలు వృథా అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను సిబ్బంది సరైన విధంగా భద్రపరచకపోవడంతో నష్టం వాటిల్లింది. సాంపిల్స్ తీసిన సిబ్బంది వాటికి సరిగా మూతలు పెట్టకపోవడం, శాంపిల్స్‌పై నంబర్ వేయకపోవడం వల్ల 27వేల […]
ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. మచిలీపట్నం చేపల మార్కెట్లో భాస్కర రావు ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు, రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కర రావును ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. భాస్కర రావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్‌గా పని చేశారు. పేర్ని నానికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. గడిచిన […]
కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, ఈ రోజు రూ.512 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 […]