iDreamPost
android-app
ios-app

ఏపీకి వాన ముప్పు.. మూడు రోజులపాటు భారీ వర్షాలు

AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్తను అందించింది. ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నది. మూడు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు తెలిపింది.

AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్తను అందించింది. ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నది. మూడు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు తెలిపింది.

ఏపీకి వాన ముప్పు.. మూడు రోజులపాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో వానలు తగ్గేలా లేవు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీ మొత్తం అతలాకుతలం అయ్యింది. కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్థంబించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడనగరం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. వరద ముంచెత్తడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే జనాలు వానలు, వరదల నుంచి తేరుకుంటున్నారు. ఈ సమయంలో ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. ఇప్పుడు మరో అల్పపీడనం భయపెడుతోంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శనివారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.