iDreamPost
android-app
ios-app

దంచి కొడుతున్న వానలు.. రేపు ఆ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

  • Published Sep 08, 2024 | 5:00 PM Updated Updated Sep 08, 2024 | 5:02 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ జిల్లాలోని రేపు స్కూళ్లు, కాలేజీలు సెలవు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ జిల్లాలోని రేపు స్కూళ్లు, కాలేజీలు సెలవు ప్రకటించారు.

  • Published Sep 08, 2024 | 5:00 PMUpdated Sep 08, 2024 | 5:02 PM
దంచి కొడుతున్న వానలు.. రేపు ఆ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

ఆంధ్రప్రదేశ్‌ కు ఇప్పటిలో వర్షాలు వీడే అవకాశం కనిపించడం లేదు. కాగా, ఇప్పటికే ఏపీలో గత వారం రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలు, వరదలు నుంచి ఇంక తెరుకోక ముందే.. మరోసారి భారీ వర్షాలు కురవనున్నయని తాజాగా వాతవరణ శాఖ నేడు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే నేటి ఉదయం నుంచి పలు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తాజాగా సోమవారం ఆ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీంతో ఇది వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. అంతేకాకుండా.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ వాయుగుండం ప్రభావం ప్రస్తుతం విజయగనరం జిల్లాలో ఎక్కువగా ఉంది. దీంతో నేడు ఆ జిల్లాలో ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అలాగే సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలోని రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ.. కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరోవైపు కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇకపోతే ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య- అనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగుతుంది. అయితే ఇది ళింగపట్నానికి తూర్పున 280 కిలో మీటర్లు, గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 230 కిలోమీటర్లు,పారాదీప్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 260 కిలో మీటర్లు, దిఘాకు దక్షిణంగా 390 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉంది. అయితే ఈ వాయుగుండం మరీంత బలపడే అవకాశం ఉన్నందున్న.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం సూచన చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు పేర్కొంది. మరి, భారీ వర్షాల కారణంగా రేపు విజయనగరం జిల్లాలో స్కూళ్లు సెలవు పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.