iDreamPost
android-app
ios-app

Simbu: AP- తెలంగాణకు అండగా శింబు.. కోలీవుడ్ నుంచి విరాళం ఇచ్చిన మెుదటి హీరో!

  • Published Sep 10, 2024 | 12:41 PM Updated Updated Sep 10, 2024 | 12:41 PM

Simbu Donated Rs. 6 lakhs To AP-Telangana Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా నిలబడింది టాలీవుడ్. అయితే.. కోలీవుడ్ నుంచి సాయం అందించిన తొలి హీరోగా శింబు నిలిచాడు.

Simbu Donated Rs. 6 lakhs To AP-Telangana Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా నిలబడింది టాలీవుడ్. అయితే.. కోలీవుడ్ నుంచి సాయం అందించిన తొలి హీరోగా శింబు నిలిచాడు.

  • Published Sep 10, 2024 | 12:41 PMUpdated Sep 10, 2024 | 12:41 PM
Simbu: AP- తెలంగాణకు అండగా శింబు.. కోలీవుడ్ నుంచి విరాళం ఇచ్చిన మెుదటి హీరో!

ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఏపీ, తెలంగాణను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు, చెరువుల పొంగి ఊర్లన్నీ జలమయం అయ్యాయి. మరీ ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం పట్టణాలను వరదలు ముంచెత్తాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా భారీ ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా నిలిచింది మన టాలీవుడ్. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోలు, నిర్మాతలు భారీ విరాళాలు ప్రకటించి తమ గొప్ప మనసు చాటుకున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ నుంచి శింబు ఏపీ, తెలంగాణకు తన సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. దాంతో తమిళ్ ఇండస్ట్రీ నుంచి విరాళం ఇచ్చిన మెుదటి హీరోగా నిలిచాడు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇక నష్ట నివారణ చర్యల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా.. తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచింది. తారక్, మహేశ్ బాబు, ప్రభాస్,  బాలయ్య, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, నిర్మాతలు నాగ వంశీ, చిన్నబాబు, వైజయంతీ మూవీస్ ఇలా స్టార్ హీరోలతో పాటుగా నిర్మాణ సంస్థలు కూడా భారీ విరాళాలు ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశ్రమల నుంచి ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. కానీ.. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఏపీ, తెలంగాణకు విరాళం  అందించి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

కాగా.. తెలుగు తర్వాత ఇతర ఇండస్ట్రీల నుంచి సాయం అందించిన తొలి హీరోగా నిలిచాడు శింబు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 6 సాయాన్ని ప్రకటించాడు ఈ తమిళ్ స్టార్ హీరో. ఈ మెుత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నాడు. దాంతో శింబును రెండు తెలుగు రాష్ట్రాలకు అడాప్టెడ్ సన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుసుకొస్తున్నారు. అయితే వయనాడ్ బాధితులకు అండగా నిలిచిన సూర్య, కార్తీ, కమల్ లాంటి హీరోలు.. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తే.. కామ్ గా ఉండటం అభిమానులకు నచ్చడం లేదు. మరి శింబు చూపిన దారిలో ఇతర తమిళ హీరోలు నడుస్తారో? లేదో? చూడాలి. మరి ఏపీ, తెలంగాణ వరద బాధితులకు అండగా నిలిచిన శింబుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet