iDreamPost
android-app
ios-app

రియల్ లైఫ్ కర్రీ అండ్ సైనైడ్.. వీళ్ళు మమూలు ఆడోళ్ళు కాదు..

  • Published Sep 08, 2024 | 12:13 PM Updated Updated Sep 08, 2024 | 12:48 PM

అమాయకపు మాటలతో వల చేసి, తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఈ లేడీ ముఠా అచ్చం సినిమాను మించిన రేంజ్‌ లో మాస్టర్‌ ప్లాన్‌ తో చేస్తున్న దారుణాలు తెలిస్తే షాక్‌ అవుతారు.

అమాయకపు మాటలతో వల చేసి, తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఈ లేడీ ముఠా అచ్చం సినిమాను మించిన రేంజ్‌ లో మాస్టర్‌ ప్లాన్‌ తో చేస్తున్న దారుణాలు తెలిస్తే షాక్‌ అవుతారు.

  • Published Sep 08, 2024 | 12:13 PMUpdated Sep 08, 2024 | 12:48 PM
రియల్ లైఫ్ కర్రీ అండ్ సైనైడ్.. వీళ్ళు మమూలు ఆడోళ్ళు కాదు..

ఇటీవల కాలంలో ఈజీ మనీ,జాల్సాలకు అలావాటు పడిపోయి చాలామంది ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. ముఖ్యంగా ఈ దారుణలకు స్కెచ్‌ లు వేస్తున్న వారిలో మహిళలు కూడా ఉండటం గమన్హారం. ఈ లేడీ గ్యాంగ్‌ అమాయకపు మాటలతో తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకొని, తిరిగి చెల్లించకుండా మోసం చేయడం, చివరికి వారి ప్రాణాలు కూడా తీస్తున్న ఘటనలు చాలనే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ముగ్గురు మహిళలు కూడా అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా చేసిన దారుణాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

అమాయకపు మాటలతో తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకొని, తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న లేడీ హంతక ముఠాను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు తల్లీకుమార్తె కాగా, వారికి ఇద్దరు మహిళలు తోడై ఈ దారుణాలకు తెగబడ్డారు.ఇకపోతే వీరి చేస్తున్నహత్యలు కూడా సీరియల్‌ కిల్లర్స్‌ కు తలపించేలా ఉండటం గమన్హారం. ఒక రకంగా చెప్పాలంటే.. కర్ర విరగకూడదు.. పాము చావు చావకూడదు అనే  సమేత రేంజ్‌ లో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇ‍క ఈ ముఠా గుట్టు బయటపడటంతో.. వీర వివరాలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్‌కుమార్‌ మీడియా ముందు వివరించారు. కాగా, అందులో తెనాలి లింగయ్యకాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి అలియాస్‌ బుజ్జి (32) అనే మహిళ ప్రధాన నిందితురాలు. అయితే ఈ నిందితురాలు బుజ్జి గతంలో సీఏ కోర్సు మధ్యలో ఆపేసి కొన్నాళ్లు వాలంటీర్‌ గా పనిచేసింది.

ఆ తర్వాత కంబోడియా వెళ్లి, అక్కడివాళ్లతో కలిసి సైబర్‌నేరాలకు పాల్పడింది. కానీ, అంతలోనే అనారోగ్యానికి గురవ్వడంతో తిరిగి తెనాలి చేరుకున్న ఈమె భర్తను వదిలేసి, తల్లి  గొంతు రమణమ్మతో కలిసి ఉంటుంది. అయితే బాగా జల్సాలకు అలవాటు పడిన తల్లీ కుమార్తెలు, వీరికి తోడు తెనాలికి చెందిన మరో ఇద్దరు మహిళలు.. మొదట అమాయకపు మాటలతో అందర్నీ నమ్మించి బుట్టలో వేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ల దగ్గర అప్పు తీసుకొని జాల్సలకు పాల్పడతారు. తీరా అప్పు తీర్చమని ఒత్తిడి మొదలుపెడితే..  మాయ మాటాలు చెప్పి వారికి  శీతల పానీయంలో సైనైడ్‌ కలిపి ఇచ్చి హత్య చేసేవారు. ఇలా ఇప్పటికే వీరంతా కలిసి ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని హత్య చేశారు. అలా మరో ముగ్గురు మహిళలను హత్య చేసేందుకు ప్లాన్‌ చేయగా.. అది కాస్త బెడిసికొట్టింది.

అయితే వీరి గుట్టు ఎలా బయటపడిదంటే.. ఈ ఏడాది ఈ ఏడాది జూన్‌ 5న చేబ్రోలు మండలం వడ్లమూడి శివారు నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం పడి ఉండటంపై అప్పటి ఎస్సై మహేశ్‌కుమార్‌ అనుమానాస్పద మృతిగా కేసుపెట్టారు. కానీ, ప్రస్తుత ఎస్సై వెంకటకృష్ణ ఈ కేసేను  దర్యాప్తు చేపట్టాగా.. ప్రాథమికంగా హత్యగా తేలడంతో ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశాలతో తెనాలి డీఎస్పీ జనార్దన్, పొన్నూరు రూరల్‌ సీఐ కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై వెంకటకృష్ణ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.  కాగా, మృతురాలు తెనాలి యడ్లలింగయ్యకాలనీకి చెందిన నాగూర్‌బీగా గుర్తించారు. అయితే అతే ప్రాంతానికి చెందిన రజిని.. నాగూర్‌బీ వద్ద అప్పు తీసుకొందని, తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న నాగూర్‌బీని ఎలాగైనా హత్య చేయాలని భావించి ఈ విషయం వెంకటేశ్వరితో పంచుకోవడంతో అంతా కలిసి పథకం వేశారు.

దీంతో పథకం ప్రకారం.. నాగూర్‌బీని నమ్మించి ఆటోలో వడ్లమూడి వైపు తీసుకెళ్లి, సైనైడ్‌ కలిపిన బ్రీజర్‌ను తాగించి హత్యచేశారు. ఇక వీరందరూ మృతురాలు నాగూర్‌బీని ఆటోలో తీసుకొని వెళ్తున్నా దృశ్యాలు.. సమీపంలోని సీసీ కెమెరాలో పోలీసులు  పరిశీలించి ఆటోడ్రైవర్‌ను విచారించారు. దీంతో వెంటనే రజినీని అదుపులోకి తీసుకొని ఆరాతీయగా.. తీగ లాగితే డొంక కదిలినట్లు..ఈ హత్యతో పాటు ఈ తల్లీకుమార్తెలు చేస్తున్న సీరియల్‌ హత్యల దారుణాలు కూడా బయటపడ‍్డాయి. వెంటనే పోలీసులు నిందితుల్లో రమణమ్మ, వెంకటేశ్వరి, రజినీలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ గ్యాంగ్‌ లో ఉంటూ భర్తను హత్యను చేసిన నిందితురాలు భూదేవి, సైనైడ్‌ సరఫరా చేసిన తెనాలికి చెందిన కృష్ణపై పోలీసులు కేసు నమోదుచేశారు. మరీ, సినిమాను తలపించే రేంజ్‌ ఈ లేడీ గ్యాంగ్‌ చేసిన దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.