iDreamPost
android-app
ios-app

1986లో వరదలు.. మన సెలబ్రిటీలు ఎవరెవరు ఎంతిచ్చారంటే..?

తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు, వరదలకు ఇరు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి విదితమే. ఈ విపత్తు పట్ల స్పందించింది సినీ ఇండస్ట్రీ. పెద్ద సంఖ్యలో విరాళాలు అందజేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడే కాదు. 1986లో కూడా విరాళాలు అందించారు మన సెలబ్రిటీలు.

తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు, వరదలకు ఇరు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి విదితమే. ఈ విపత్తు పట్ల స్పందించింది సినీ ఇండస్ట్రీ. పెద్ద సంఖ్యలో విరాళాలు అందజేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడే కాదు. 1986లో కూడా విరాళాలు అందించారు మన సెలబ్రిటీలు.

1986లో వరదలు.. మన సెలబ్రిటీలు ఎవరెవరు ఎంతిచ్చారంటే..?

ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడటంతో తెలంగాణలో ఖమ్మం, అటు విజయవాడ నగరం నీట మునిగింది. రహదారులు నదులను తలపించాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది. రోడ్లపైనే కాదు ఇళ్లల్లోకి నీరు చేరి అవస్థలు పడ్డారు. పీకల్లోతు నీళ్లు చేరడంతో నివాసాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి.  ఈ విపత్తు కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇరు రాష్ట్రాల్లో 50 మందికి పైగా మరణించారు. తాగడానికి నీరు, తినడానికి ఆహారం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్రమైన ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వరద బాధితులకు అండగా నిలిచింది సినీ పరిశ్రమ. సెలబ్రిటీలంతా స్పందించి తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఇప్పుడే కాదు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ను వానలు, వరదలు కుదిపేశాయి. దివిసీమతో పాటు 1986లో వచ్చిన వరదలు ఉమ్మడి ఏపీని ముంచేశాయి. ఆ ఏడాది కురిసిన వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరిగి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి లోతట్టు, లంక ప్రాంతాలు జలమయమయ్యాయి. 250 మందికి పైగా మరణించారు. సుమారు లక్ష మందికి పైగా (అప్పట్లో ఎక్కువ మట్టితో కట్టుకున్న గుడిసె, పాకలు, ఇటుకల ఇళ్లే) నిరాశ్రయిలయ్యారు. రాజమండ్రి సమీపంలో రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఆ సమయంలో కూడా సినీ ఇండస్ట్రీ కదిలి పెద్ద సంఖ్యలో విరాళాన్ని అందించింది. తెలుగు స్టార్సే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు సైతం తమ వంతు సాయం అందించడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి 50 వేల రూపాయలు అందించగా.. అక్కినేని నాగేశ్వరరావు 25 వేలు అందించారు. సూపర్ స్టార్ కృష్ణ లక్ష రూపాయలు, కృష్ణం రాజు 1.05 లక్షలు అందించారు. బాలకృష్ణ తన వంతు కర్తవ్యంగా 2.50 లక్షల రూపాయలు అందించి..అందరి కన్నా ఎక్కువ విరాళం ఇచ్చిన హీరోగా నిలిచారు. అలాగే అదే సమయంలో విక్రమ్ యూనిట్ తరుఫున రెండున్నర లక్షల విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. మోహన్ బాబు రూ. 25 వేలు, దాసరి నారాయణ రావు రూ. లక్ష, రామానాయుడు రూ. 50 వేలు అందించారు. అశ్వనీదత్ రూ. 10వేలు విరాళమిచ్చారు. వీరే కాదు బాలీవుడ్ హీరోలు జితేంద్ర, రాజేశ్ ఖన్నాలు కూడా తమ వంతు సాయంగా చెరో లక్ష అందించారు. రజనీకాంత్, కమల్ హాసన్ రూ. 50 వేలు, నగేష్ రూ. 10వేలు ఇచ్చి తమ మంచి మనస్సు చాటుకున్నారు.

వీరే కాదు.. హీరోయిన్లు, సింగర్స్ కూడా తమ వంతు ఆర్థిక సాయాన్ని స్వచ్ఛందంగా అందించారు. అతిలోక సుందరి శ్రీదేవి, జయప్రద, జయసుధ చెరో 50 వేలు అందించారు. విజయశాంతి, మాధవి, సుజాత పదివేలు, సిల్క్ స్మిత, జయమాలిని ఐదు వేలు, సింగర్ సుశీల పదివేలు, శైలజ ఐదు వేలు ఇచ్చారు. వీరే కాదు నిర్మాణ సంస్థలు, ఇతర టెక్నీషియన్లు కూడా తమ వంతు సాయాన్ని అందించి. . వరద బాధితుల్ని ఆదుకున్నారు.  కష్టకాలంలో అండగా నిలిచి రియల్ హీరోలు అయ్యారు. ఇప్పుడు కూడా తమ వంతు సాయం చేసి తమ పెద్ద మనసు చాటుకున్నారు మన స్టార్స్.