Krishna Kowshik
ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలా కుతలం అయిన సంగతి విదితమే. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ముంచేసింది వరద. ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో సినీ, రాజకీయ, వ్యాపార రంగంలోని ప్రముఖులు తమ చేతనైన సాయం చేస్తున్నారు. తాజాగా లలితా జ్యయెల్లరీ అధినేత కూడా..
ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలా కుతలం అయిన సంగతి విదితమే. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ముంచేసింది వరద. ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో సినీ, రాజకీయ, వ్యాపార రంగంలోని ప్రముఖులు తమ చేతనైన సాయం చేస్తున్నారు. తాజాగా లలితా జ్యయెల్లరీ అధినేత కూడా..
Krishna Kowshik
‘డబ్బులు ఎవరికీ ఊరికనే రావు’ అంటూ తన యాడ్స్‌తో ఫేమ్ అయ్యారు లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్. చూసేందుకు ఫన్నీగా అనిపించొచ్చు కానీ మనీ విలువ తెలియజేస్తుంటాయి ఆయన ప్రకటనలు. సామాన్య కుటుంబం నుండి ఈ స్థాయికి ఎదిగిన ఆయనకు.. డబ్బు విలువ తెలుసు కాబట్టి.. కష్టపడిన సొమ్మును ఈజీగా వదులుకోవద్దు అంటూ హితవు కోరుతుంటారు. కస్టమర్లకు నాలుగు మంచి మాటలు చెప్పే ఆయన మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన వంతు సాయం చేశారు కిరణ్ కుమార్. ఏపీకి భారీ విరాళాన్ని ప్రకటించి.. మాటల్లోనే కాదు చేతల్లోనూ గొప్పోడని నిరూపించారు లలితా జ్యూయలర్లీ అధినేత.
వరదలతో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తన వంతు ఆర్థిక సాయాన్ని అందించారు కిరణ్ కుమార్. కోటి రూపాయలను విరాళంగా అందించారు. సీఎం చంద్రబాబును కలిసి విరాళం తాలూకా చెక్ అందజేశారు. విపత్తు వేళ ప్రతి ఒక్కరు చేతనైన సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు. ఈ విపత్తు వేళ సినీ ఇండస్ట్రీ కూడా పెద్ద యెత్తున ముందుకు వచ్చిన సంగతి విదితమే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, పవన్ కళ్యాణ్, సోనూ సూద్ వంటి స్టార్లంతా తమ చేతనైనా సాయం చేసిన సంగతి విదితమే. అలాగే రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. ఇక వరద బాధితులకు సహాయం చేయాలనుకునేవారి కోసం ఏపీ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసింది.
ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైన సంగతి విదితమే. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ముంచేసింది. బుడమేరు వాగుకు గండి పడటంతో వరద నీరు పోటెత్తి.. ఊళ్లను ముంచేసింది. నగరంపైకి జల ప్రళయంలా విరుచుకుపడింది. దీంతో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంతో పాటు పాయకాపురం, కండ్రిక, న్యూ అండ్ ఓల్డ్ రాజరాజేశ్వరి పేట, గుణదల, ఇబ్రహీం పట్నం, వన్ టౌన్ నీట మునిగాయి. వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నారు. పైన వర్షం ఓ వైపు, కింద వరద నీరుతో అల్లాడిపోయారు. తిండి, నిద్ర లేక నానా అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతుంది. మళ్లీ వానలు నగరాన్ని ముంచేస్తున్నారు. బుడమేరుకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భయం గుప్పిట్లో బతుకుతోంది బెజవాడ.