iDreamPost
android-app
ios-app

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన

  • Published Sep 08, 2024 | 1:32 PM Updated Updated Sep 08, 2024 | 1:32 PM

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీంతో ఏపీలో మరోసారి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నయని వాతవరణ శాఖ తాజాగా హెచ్చరించింది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీంతో ఏపీలో మరోసారి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నయని వాతవరణ శాఖ తాజాగా హెచ్చరించింది.

  • Published Sep 08, 2024 | 1:32 PMUpdated Sep 08, 2024 | 1:32 PM
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన

గత వారం రోజులు క్రితం కురిసిన కుండపోత వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి భీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ భారీ వర్షాలు వరదలు కారణంగా.. రహదారులన్ని జలమయమవ్వడమే కాకుండా.. కొనని ప్రాంతాల్లో ఇళ్లు సైతం కొట్టుకుపోయాయి. చాలామంది ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ విపత్తు నుంచి కోలుకుంటున్న పరిస్థితుల్లో బంగాళఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీలో మరోసారి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది.  ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. దీంతో ఇది వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. అంతేకాకుండా.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలకు వాతవరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించింది.

ఇకపోతే ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ..రానున్న 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతవరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని పేర్కొంది. దీంతో ఇప్పుడిప్పుడే వర్షాల తీవ్రత నుంచి కొలుకుంటున్న ఏపీ వాసులకు మరోసారి భారీ వర్ష సూచన జారీ చేయడంతో తీవ్ర భయందోళనలో ఉన్నారు. అంతేకాకుండా.. మరోవైపు ఇప్పటికే పలు పలు ప్రాంతాల్లో బలమైన గాలులు, మోస్తరు వాన కురుస్తుంది. మరీ,    ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నయని వాతవరణ శాఖ హెచ్చరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.