iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి.

WCD Recruitment 2024: మహిళలకు గుడ్ న్యూస్. అంగన్ వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆఫ్ లైన్ విధానంలో సెప్టెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు.

WCD Recruitment 2024: మహిళలకు గుడ్ న్యూస్. అంగన్ వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆఫ్ లైన్ విధానంలో సెప్టెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు.

మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి.

బాల బాలికలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాలను ప్రవేశపెట్టింది. ఈ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నది. అంగన్ వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమిస్తూ స్టాఫ్ కొరత లేకుండా చూస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఏపీలోని ఆ జిల్లాలో పలు జాబ్స్ ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పదో తరగతి పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మహిళలకు ఇదొక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.

వైఎస్సార్‌ జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పలు అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. అంగన్‌వాడీ కార్యకర్తకు 10వ తరగతి.. మిగిలిన పోస్టులకు 7వ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఏడు, పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్‌ 17వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం ఖాళీల సంఖ్య: 74
  • మినీ అంగన్‌వాడీ కార్యకర్త: 04 పోస్టులు
  • అంగన్‌వాడీ కార్యకర్త: 59 పోస్టులు
  • అంగన్‌వాడీ సహాయకురాలు: 11 పోస్టులు

అర్హత:

  • అంగన్‌వాడీ కార్యకర్తకు 10వ తరగతి.. మిగిలిన పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే మహిళలు స్థానికులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ఏడు, పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత వైఎస్సార్‌ జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:

  • 17-09-2024

ఇంటర్వ్యూ తేదీ:

  • 28-09-2024

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం:

  • జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కడప.