కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. అత్యధిక పరీక్షలు చేయడంతోపాటు అతి తక్కువ ఇన్ఫెక్షన్ రేటు రికవరీ రేటు విషయంలో ఏపీ ఎంతో ముందుంది. ఇతర రాష్ర్టాలలో ఉన్న ఏపీ ప్రజలు తమ సొంత రాష్ట్రంలో ఉంటే బతికి పోవచ్చనే భావనలో వున్నారు. వలంటీర్ల సాయంతో కోవిడ్ సోకిన బాధితులను గుర్తించి, సరైన సమయంలో చికిత్స అందజేయడం ద్వారా ప్రాణాపాయం తప్పుతోంది. 3టీ వ్యూహంతో కట్టడి..! కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి […]
దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదాస్పదమయ్యారు. ప్రభుత్వంతో ప్రతి విషయంలోను ఘర్షణకు దిగారు. స్థానిక సంస్థల ఎన్నికను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మొదలు పెట్టి… పదవీ విరమణ చేసే ముందటి వరకు ప్రతీ విషయంలో ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నారు. ప్రతీ చిన్న విషయానికి కోర్టుకు..! నిమ్మగడ్డ తన ప్రతీ అడుగు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన్నట్లుగానే వేశారన్న అపకీర్తి మూట కట్టుకున్నారు. తన చర్యల ద్వారా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా […]
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల తొలి దశ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగింది. పల్లె ఓటర్లు ఉత్సాహంలో ఓటింగ్లో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. టీడీపీ నాయకులు ఆరోపించినట్లుగా.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంత వాతావారణంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం 2:30 గంటలకే 75.55 శాతం పోలింగ్ జరిగింది. ఇది మరింత పెరగనుంది. పంచాయతీ ఎన్నికలు కావడం […]
మూడు రాజధానుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు రాజ్ భవన్ ఆమోదముద్ర వేసినప్పటికీ.. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. కోర్టు కేసుల ఇబ్బందుల రూపంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం వేచి చూస్తోంది. కాగా.. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి పరిపాలనను విశాఖపట్నానికి తరలించడానికి గత ఏడాదిలోనే ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా కోర్టు […]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఘటనలు.. ప్రతిపక్షాల చేష్టలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటే.. మరోవైపు ప్రతిపక్షాలు రెచ్చగొట్టే పథకాలు అమలు చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ద్వేష దాడులు.. విద్వేష కార్యక్రమాలు అమలవుతున్న తీరు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రజలు అందరూ తమ రక్షణ కోసం, తమ కష్టాలు తీరేందు కోసం దేవుడి వద్దకు వెళ్తుంటారు. తెలుగుదేశం నాయకులు మాత్రం ప్రభుత్వంపై తమ పగ తీర్చుకునేందుకు, […]
కారణం లేకుండా ఏదీ జరగదు. ముఖ్యంగా తగిన సిద్ధాంతం, ప్రజల ప్రయోజనాలు తదితర ప్రజా ప్రయోజనార్ధ అంశాల్లేకుండా రాజకీయాలు నడుస్తున్నప్పడు ఈ ‘కారణం’ వెతకాల్సిందే. ఇందుకు ఏ ఒక్కరు కూడా ఆక్షేపించరు. ఏపీలో సీయంగా వైఎస్ జగన్ బాధ్యలు చేపట్టిన తరువాత ఆయనపై మత పరమైన ఆరోపణలు ఎక్కువైపోయాయి. ఎన్నికల ముందు కూడా ఇది కొనసాగినప్పటికీ దాని ప్రయోజనం పెద్దగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదనే చెప్పాలి. అయితే ఫలితాల తరువాత కూడా ఇదే పంథాలను కొనసాగిస్తుండడం […]
2020… ప్రపంచ మానవాళికి శాశ్వతంగా గుర్తుండిపోతుంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి ప్రభావితం కాని వారు, ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు అంటూ ఎవరూ లేరు. ప్రపంచంలోను, అందులోనూ భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే.. ఏపీ ప్రజలు కరోనా మహమ్మారి వల్ల తెలెత్తిన ఇబ్బందులను ప్రభుత్వ అండతో సులువుగా అదిగిమించారని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి ఏపీ ప్రజలను జగన్సర్కార్ గట్టెక్కించింది. కరోనా సమయంలో దేశ ప్రభుత్వాలు, ఆర్థికంగా బలమైన […]
ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. ఇప్పడిప్పుడే కోవిడ్ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిటన్లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా […]
దాదాపు ఆరు నెలలుగా ఊరిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. వచ్చే నెలలో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందకు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేసే ముందుగా లోటుపాట్లను సవరించుకునేందుకు నిర్వహించే డ్రైరన్ (డమ్మీ వ్యాక్సినేషన్)ను ఈ రోజు దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలో ఈ రోజు, రేపు ఈ డ్రైరన్ కొనసాగనుంది. ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏపీలో కృష్ణా జిల్లాలో డమ్మీ […]
పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలతో దేశం దృష్టిని ఆకర్షించిన ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో చారిత్రక కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టుబోతోంది. 1920 తర్వాత మళ్లీ తొలిసారి భూముల రీ సర్వే జరుగుతోంది. సమగ్ర భూ సర్వే ద్వారా ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు, సరిహద్దు వివాదాలు పరిష్కారం కాబోతున్నాయి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, మరియు భూ రక్ష పథకం పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా భూ యజమానులకు శాశ్వత […]