iDreamPost
android-app
ios-app

Eluru News: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దారుణం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై…!

Eluru News: చాలా మంది అమ్మాయిలు తమకు ఎదురవుతున్న చేదు సంఘటనలు లోలోప దాచుకుని కుంగిపోతున్నారు. మరికొందరు మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Eluru News: చాలా మంది అమ్మాయిలు తమకు ఎదురవుతున్న చేదు సంఘటనలు లోలోప దాచుకుని కుంగిపోతున్నారు. మరికొందరు మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Eluru News: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దారుణం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై…!

సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆడవాళ్లు సైతం అన్ని రంగాల్లో తమ  ప్రతిభను చాటిచెబుతున్నారు. పురుషులకు ధీటుగా మహిళులు పనులు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. ఇది నాణ్యంకి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆడవారు, బాలికలు వివిధ రకాల వేధింపులకు గురువుతున్నారు. చాలా మంది అమ్మాయిలు తమకు ఎదురవుతున్న చేదు సంఘటనలు లోలోప దాచుకుని కుంగిపోతున్నారు. మరికొందరు మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొందరి వ్యక్తుల దారుణాలు బయటపడుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ హాస్టల్ వార్డెన్ దారుణానికి ఒడిగట్టాడు. ఫోటోషూట్  పేరుతో బాలికపై వివిధ రకాల వేధింపులకు పాల్పడే వాడు. ఇక బాధితబాలికలు తెలిపిన వివరాల ప్రకారం…

ఏలూరు జిల్లా కేంద్రంలోని అమీనాపేట‌లో శ్రీ స్వామి స‌రస్వ‌తి సేవా ఆశ్ర‌మం పేరుతో బాలిక హాస్టల్ ఉంది. ఇందులో 50 మంది బాలికలు వ‌స‌తి పొందుతున్నారు. ఇక్కడ ఉంటూ వేర్వేరు విద్యా సంస్థ‌ల్లో ఆ బాలికలు చ‌దువుకుంటున్నారు.  ఇది ఇలా ఉంటే..కోవిడ్ స‌మ‌యంలో ఆ ఆశ్రమ నిర్వహాకులు హాస్టల్ ను ప‌ట్టించుకోలేదు. దీంతో ఏలూరుకి చెందిన శ‌శికుమార్ అనే వ్యక్తి ఈ ఆశ్రమాన్ని చేజిక్కించుకున్నాడు. చింత‌ల‌పూడి మండ‌లం య‌ర్ర‌గుంట‌ప‌ల్లిలోని ప్ర‌భుత్వ బీసీ వ‌స‌తి గృహం వార్డెగా శశికుమార్ పనిచేస్తున్నాడు. అలానే ఓ ఫోటో స్టూడియోను సైతం ఆయన నడుపుతున్నాడు.

ఇక స్వామి సరస్వతి సేవ ఆశ్రమంలోని హాస్టల్ కి వార్డెన్ గా తన రెండో భార్య మణిశ్రీని  నియమించాడు. అలానే విద్యార్థినుల సంర‌క్ష‌కురాలిగా మేన‌కోడ‌లు లావ‌ణ్య‌ని నియమించాడు. ఇంత వరకు స్టోరీ బాగానే ఉంది. ఇక్కడి నుంచి ఆ వార్డెన్ దుర్మార్గపు ఆలోచన బయటకు వచ్చింది. హాస్టల్ లో ఆశ్రయం పొందుతున్న బాలికలను ఫొటోషూట్‌ పేరుతో మాయ‌ మాట‌లు చెప్పి లోబ‌ర్చుకునేవాడు. ఇదే విషయాన్ని ఆ హాస్టల్ కి చెందిన ముగ్గురు బాలికలు పోలీసులకు తెలియజేశారు. అంతేకాక పోలీసుల వద్ద తమకు జరిగిన వేధింపుల గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

శశికుమార్.. ఫొటో షూట్‌ల కోస‌మ‌ంటూ బాలిక‌ల్ని దూర ప్రాంతాల‌కు తీసుకెళ్తాడ‌ని, అనంతరం వారిపై అఘాయిత్యానికి పాల్ప‌డ‌తాడ‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎదురుతిరిగిన వారిని ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే హాస్టల్ కు వెళ్లే పిల్లలను తాను నిర్వహించే వసతి గృహంలోకి వచ్చేలా చేసేవాడని తెలిపారు. వసతి గృహంలో తమను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసే వాడ‌ని, అడ్డుచెబితే దాడికి పాల్ప‌డేవాడ‌ని పోలీసుల వద్ద బాధితులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ప‌దుల సంఖ్య‌లో బాలిక‌ల‌ను లైంగికంగా వేధించిన‌ట్లు బాలికలు చెబుతున్నారు. అలానే ఫోటో షూట్ పేరుతో ఈనెల 15 ఆదివారం ఓ బాలిక‌ను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడ‌ని తెలిపారు. అక్క‌డ బాలిక అత్యాచారం చేసి 16వ తేదీ సోమ‌వారం రాత్రి తిరిగి తీసుకొచ్చి హాస్టల్ కి తీసుకొచ్చి దింపారని బాలికలు అన్నారు.

ఇక అదే రోజు రాత్రి స‌మ‌యంలో ఆ బాలిక ఏడుస్తూ ఉండ‌గా మిగిలిన బాలిక‌లు ప్ర‌శ్నించగా అసలు విషయం తమకు తెలిసిందని బాధితులు తెలిపారు. వార్డెన్‌ ఆగ‌డాల‌ను భ‌రించ‌లేని ముగ్గురు బాలిక‌లు మంగ‌ళ‌వారం రాత్రి పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు. బాధిత బాలిక‌ల బంధువులు, త‌ల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకోవడంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ శ్రావ‌ణ్ కుమార్ బాలికల హాస్టల్ ను ప‌రిశీలించారు.  నిందితుడు, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన వారిపై పోక్సో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేస్తామ‌ని అన్నారు. ప్ర‌స్తుతం నిందితుడు శశికుమార్‌ ప‌రారీలో ఉన్నాడు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.