iDreamPost
android-app
ios-app

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ కీలక అప్డేట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

  • Published Sep 17, 2024 | 11:10 AM Updated Updated Sep 17, 2024 | 11:20 AM

Heavy Rains in Hyderabad: వర్షాలపై వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.. ఇటీవల భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు రెండు మూడు రోజుల నుంచి కోలుకుంటున్నారు. తాజాగా మరోసారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Heavy Rains in Hyderabad: వర్షాలపై వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.. ఇటీవల భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు రెండు మూడు రోజుల నుంచి కోలుకుంటున్నారు. తాజాగా మరోసారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.

  • Published Sep 17, 2024 | 11:10 AMUpdated Sep 17, 2024 | 11:20 AM
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ కీలక అప్డేట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

గత నెలరోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం వల్ల ఇరు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తెలంగాణలో వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇక ఏపీలో విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. బుడమేరు వాగు ముంచేసింది. ఇప్పటికీ అక్కడ ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా వరుణడు కాస్త బ్రేక్ ఇచ్చాడని సంతోషంలో ఉన్న వేళ ఐఎండీ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. వర్షాల కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. 10 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని అంటున్నారు.

నేడు తెలంగాణలో కొమురంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్‌పల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాగ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తెలిక పాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం ఎండ, ఆ వెంటనే మేఘాలు.. మళ్లీ ఎండ రావడం లాటింది జరుగుతుందని తెలిపింది. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ బంగ్లాదేశ్, బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఏపీలో కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి, కోనసీమ, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే చేపల వేటకు వెళ్లేవారికి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం కారణంగా అరేబియా సముద్రంలో గాలి వేగం విపరీతంగా పెరిగిపోయింది. ఏపీలో గంటకు 15 నుంచి 21 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. తెలంగాణలో గాలి వేగం 13 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ 26-28 మధ్యలో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం, తుఫాన్ వల్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.