iDreamPost
android-app
ios-app

సామాన్యులకు షాక్..భారీగా పెరిగిన కూరగాయల ధరలు!

Vegetable Price: ఏం కొనేటట్టు లేదు.. ఏం కొని తినేటట్టు లేదు.. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. అతివృష్టి కారణంగా వరదల్లో తోటలన్నీ పాడవడంతో కూరగాయల రేట్లు భారీగా పెరిగి..సామాన్యులకు షాకిస్తున్నాయి.

Vegetable Price: ఏం కొనేటట్టు లేదు.. ఏం కొని తినేటట్టు లేదు.. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. అతివృష్టి కారణంగా వరదల్లో తోటలన్నీ పాడవడంతో కూరగాయల రేట్లు భారీగా పెరిగి..సామాన్యులకు షాకిస్తున్నాయి.

సామాన్యులకు షాక్..భారీగా పెరిగిన కూరగాయల ధరలు!

నేటికాలంలో తినే తిండి నుంచి నడిపే బండిలోని ఇంధనం వరకు అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువుల ధరలు చూసిన కొండెక్కి కూర్చుకున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు పెరిగి సామాన్యుడి షాకి తగిలితే కూరగాయల రూపంలో మరో షాకి తగిలింది. భారీగా కూరగాయల ధరలు పెరిగాయి. దేనిని టచ్ చేసినా భగ్గుమంటుంది. కొన్ని కూరగాయల ధరలు అయితే కొండెక్కి కూర్చున్నాయి.  చికెన్ తో పోటీ అన్నట్లు కూరగాయల ధరలు దూసుకెళ్తున్నాయి. ఈ ధరలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పచ్చడి అన్నం తప్పేలా లేదని మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. ఇక పెరిగిన కూరయాగల ధరల గురించి ఇప్పుడు చూద్దాం…

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురిసిన సంగతి తెలిసింది. ఈ వరదల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అంతేకాక వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. పంట నష్టం భారీగా జరిగింది. అనేక రకాల కూరగాయల, ఇతర పంటలు నీట మునిగి రైతులకు భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధఱలు మరోసారి కొండెక్కాయి. ఈ భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. అంతేకాక వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన కూరగాయల సప్లయ్ ఆగిపోయింది.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వానలు కురవడం తో దిగబడి తగ్గింది. అంతేకాక పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో సప్లయ్ తగ్గిపోయింది. దీంతో కూరగాయలకు డిమాండ్ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వివిధ కారణాలతో కూరగాయల ధరలు పెరిగి సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లో కూరగాయల ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నపట్టికీ..అన్ని చోట్లా ధరలు భారీగానే ఉన్నాయి.

ఇక బహిరంగ మార్కెట్ లో కొత్తిమీర, పుదీనా కట్టలు రూ.60- రూ.100 పలుకుతున్నాయి. కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.80 మధ్య ఉన్నాయి. అలానే పచ్చిమిర్చి ధర కిలో 70 రూపాయలు ఉంది. అదే విధంగా చిక్కుడు రూ.100, బీరకాయ రూ.80గా పలుకుతున్నాయి. అంతేకాక బెండ రూ.70, క్యారెట్ రూ.100, కాకర రూ.80 రూపాయలు పలుకుతున్నాయి. ఇక అన్ని వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ధర ఇప్పటికే హాఫ్ సెంచరీకి చేరింది. చాలా ప్రాంతాల్లో రూ.40 నుంచి 50 మధ్య టమాట ధర ఉంది. ఈ హాఫ్ సెంచరి కాస్తా రేపో మాపో 100 చేరువగా దూసుకుపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెరిగిన కూరగాయల ధరలను చూసి జనాలు బెంబేలెత్తుతున్నారు.

ఇదే సమయంలో వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. వంటనూనెలపై  దిగుమతి సుంకం ని పెంచుతన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు వంటనూనెలపై దిగుమతి సుంకం లేని సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ వంటనూనెల ధరలు కూడా పెరగనున్నాయి. మొత్తంగా  ఈ పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు చూసి..సామాన్యుడికి ఒంట్లో వణుకు వస్తుంది. మరి..భారీగా పెరిగిన కూరగాయల ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.