iDreamPost
android-app
ios-app

ఏపీకి మరోసారి వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Published Sep 14, 2024 | 9:10 AM Updated Updated Sep 14, 2024 | 9:10 AM

బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో అది వాయుగుండంగా మారనుందని తాజాగా వాతవరణ శాఖ ప్రకటించింది. అలాగే దీని ప్రభావం ఏపీకి కూడా ఉందని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో అది వాయుగుండంగా మారనుందని తాజాగా వాతవరణ శాఖ ప్రకటించింది. అలాగే దీని ప్రభావం ఏపీకి కూడా ఉందని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

  • Published Sep 14, 2024 | 9:10 AMUpdated Sep 14, 2024 | 9:10 AM
ఏపీకి మరోసారి వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీకి ఇప్పటిలో వర్షాలు వీడే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అయితే ఎన్నడు లేని విధంగా కుండపోత వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడిప్పుడే ఆ భారీ వర్షాల, వరదల నుంచి ప్రజలు కొలుకుంటున్న లోపు మరోసారి వాతవరణ శాఖ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. అలాగే దీని ప్రభావం రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అంతేకాకుండా.. నేడు ఈ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ పేర్కొంది. ఆ వివరాలేంటో చూద్దాం.

బంగాళాఖాతంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తాజాగా వాతవరణ శాఖ ప్రకటించింది. అలాగే ఈ అల్పపీడనం 28వ తేదీకి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం, తుపానుగా బలపడుతుందని వాతవరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇది మచిలీపట్నం,  కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీఏ తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఆదివారం నాటికి పశ్చిమబెంగాల్ తీరంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే తీరం దాటిన తర్వాత ఈ నెల 18 నాటికి రాష్ట్రానికి సమీపంగా వచ్చే అవకాశముందని తెలిపింది.

ఇక దీని ప్రభావం ఎక్కువగా పశ్చిమబెంగాల్, బీహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏపీకి ఆ ప్రభావం ఉంటుదని  ఈ నేపథ్యంలోనే ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడతాయని  వాతవరణ శాఖ అంచనా వేసింది. ఇకపోతే నేడు శనివారం (సెప్టెంబర్ 14) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతవరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ఏపీకి మరోసారి వాన ముప్పు ఉండంటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరీ, ఏపీకి మరోసారి వానముప్పు ఉందని వాతవరణ శాఖ ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.