iDreamPost
android-app
ios-app

రూ.700 కోట్ల మోసం.. Hyd‌లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ..

  • Published Sep 14, 2024 | 2:38 PM Updated Updated Sep 14, 2024 | 2:38 PM

DKZ Company Cheated Issue: డబ్బు అంటే ఎవరికైనా ఆశే.. ఈ మధ్య కాలంలో చాలా మంది అత్యాశకు పోయి ఫేక్ కంపెనీల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టి దారుణంగా మోసపోతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో తరుచూ జరుగుతున్నాయి.

DKZ Company Cheated Issue: డబ్బు అంటే ఎవరికైనా ఆశే.. ఈ మధ్య కాలంలో చాలా మంది అత్యాశకు పోయి ఫేక్ కంపెనీల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టి దారుణంగా మోసపోతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో తరుచూ జరుగుతున్నాయి.

రూ.700 కోట్ల మోసం.. Hyd‌లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ..

ఇటీవల ఎదుటి వారి అత్యాశనే తమ పెట్టుబడులుగా మార్చుకొని కోట్లు సంపాదించి దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం చూపిస్తామంటూ ఆశ చూపించి మొదట వారికి సక్రమంగా డబ్బు అందిస్తూ కొద్దిరోజులకే బోర్డు తిప్పేస్తున్న కంపెనీలో ఎన్నో పుట్టుకొస్తున్నాయి.ఇలానే ఓ సంస్థ.. పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తామని చెప్పడంలో చాలా మంది లక్షల పెట్టుబడి పెట్టారు.. రాత్రికి రాత్రే ఆ కంపెనీ బోర్డు తిప్పేయడంతో లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. రూ. 700 కోట్ల రూపాయలకు టోకరా వేసి ఓ కంపెనీ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. అందులో పెట్టుబడులు పెట్టిన బాధితులు తలలు పట్టుకున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవొచ్చు అంటూ DKZ టెక్నాలజీస్ సంస్థ దాదాపు అనేక మంది నుంచి పెట్టుబడులు సేకరించింది. లాభాలు పక్కనబెడితే అసలుకే ఎసరు పెట్టింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన వేల మందికి పైగా పెట్టుబడుదారులు రూ.700 కోట్లకు పైగా నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల మాదాపూర్ లో ఉన్నDKZ టెక్నాలజీస్ కంపెనీ కార్యాలయం చాలా రోజులుగా మూసివేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లో దాదాపు 18 వేల మంది వరకు DKZ టెక్నాలజీస్ సంస్థ పెట్టుబడినట్లు తెలుస్తుంది. దీంతో మీడియా సాక్షిగా తమ బాధను వెల్లడించారు బాధితులు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే 8 నుంచి 12 శాతం వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చారని. తొలుత ఇన్వెస్టర్లకు మంచి లాభాలు చూపించారని, ఇన్వెస్ట్ చేసిన వారి ఖాతాలో రెగ్యూలర్ గా డబ్బులు జమ చేసేవారని.. అలాగే సోషల్ మీడియాలో ఇన్ల్ఫ్యూయెన్సర్లతో భారీ స్థాయిలో ప్రమోషన్లు చేయించడంతో లాభాలు వస్తాయన్న ఆశతో తాము అప్పు చేసి, గోల్డ్, భూములు అమ్మి మరీ పెట్టుబడులు పెట్టామని కన్నీటి పర్యంతం అయ్యారు. లాభాలు సంగతి దేవుడు ఎరుగు ఉన్న డబ్బంగా ఊడ్చుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

జూన్ 2024 లో పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయడం మానేశారని. మొత్తంగా రూ.700 కోట్లు దండుకొని కేటుగాళ్లు పరారయ్యారని వాపోయారు. బాధితుల ఫిర్యాదుల ఫిర్యాదు మేరకు పోలీసులు DKZ టెక్నాలజీస్ సంస్థ పై IPC 403,406,420 ఆర్/డబ్ల్యూ 120 – బి సెక్షన్ల కింద (200/2024) కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసు ఫైల్ ను హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి అప్పజెప్పారు.