iDreamPost
android-app
ios-app

కాకినాడలో అరుదైన ఘటన..’అదుర్స్’ సినిమా చూపిస్తూ ఆపరేషన్!

  • Published Sep 18, 2024 | 1:45 PM Updated Updated Sep 18, 2024 | 1:45 PM

Kakinada News: వైద్య రంగంలో అనేక చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలానే కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో ఓఅరుదైన ఘటన చోటుచేసుకుంది. రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ..అక్కడి వైద్యులు చేసిన ఆపరేషన్ అదుర్స్ అనిపించింది.

Kakinada News: వైద్య రంగంలో అనేక చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలానే కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో ఓఅరుదైన ఘటన చోటుచేసుకుంది. రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ..అక్కడి వైద్యులు చేసిన ఆపరేషన్ అదుర్స్ అనిపించింది.

  • Published Sep 18, 2024 | 1:45 PMUpdated Sep 18, 2024 | 1:45 PM
కాకినాడలో అరుదైన ఘటన..’అదుర్స్’ సినిమా చూపిస్తూ ఆపరేషన్!

వైద్య రంగంలో అనేక చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. నిత్యం ఎన్నో రకాల ఆపరేషన్లు జరుగుతుంటాయి. కొన్ని రకాల శస్త్ర చికిత్సలను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగమానదు. కారణం ఎంతో క్లిష్టమైన, అసాధ్యం అనుకునే ఆపరేషన్లను సైతం ఎంతో సులభంగా కొందరు వైద్యులు చేస్తుంటారు. ఇలా వావ్ అనిపించే ఆపరేషన్లకు కేరాఫ్ అడ్రెస్ గా ప్రభుత్వ ఆస్పత్రులు నిలుస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఇటీవల కాలంలో సినిమాలు చూపిస్తూ..రోగులకు ఆపరేషన్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అరుదైన ఆపరేషన్ కాకినాడ సర్వజన ఆస్పత్రిలో జరిగింది.  అదుర్స్ సినిమా చూపిస్తూ… మెదడు ఆపరేషన్ చేశారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, న్యూరో సర్జరీ విభాగం వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎ. కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి అనే 55  ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంది. ఆమెకు కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి లాగుతుండటంతో తీవ్ర వేదనకు గురైంది.ఈ క్రమంలోనే పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి.. ఆమెకు చూపించారు. ఈమెకు అందించే వైద్యం ఖర్చుతో కూడినదని, నయం కావడం కష్టమని ఆయా ఆస్పత్రులకు వెళ్లిన సందర్భంలో వైద్యులు తెలిపారు.

ఈ నెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా జీజీహెచ్ లో చేర్పించారు.  ఈ నేపథ్యంలో ఆమెను పరీక్షించిన వైద్యులు మెదడులో ఎడమవైపు కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇక మెదడులో ఉన్న కణితిని తొలగించాలంటే.. చాలా రిస్క్ తో కూడిన పని అని అందరికి తెలిసిందే. ఆపరేషన్ సమయంలో రోగి పొరపాటును కూడా నిద్రలోకి జారుకోకూడదు. దీంతో చాలా సమయం పాటు వైద్యులు శస్త్ర చికిత్స ఎలా చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఎంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని తెలిసింది.

దీంతో వెంటనే కాకినాడ జీజీహెచ్ వైద్యులకు ఓ ఆలోచన వచ్చింది. రోగికి అదుర్స్ సినిమా చూపించాలనే భావించారు. ఈ క్రమంలోనే ఆమెకు ‘అదుర్స్’ మూవీని ట్యాబ్ లో చూస్తుండమని చెప్పి.. కణితిని తొలగించారు. మెదడుకు సర్జరీ చేసే సమయంలో ఆమెకు ట్యాబ్ లో అదుర్స్ సినిమాను చూపిస్తూ శస్త్రచికిత్సను చేపట్టారు. ముఖ్యంగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్.. బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లను  అంటే రోగికి చాలా ఇష్టం. దీంతో.. ఆ కామెడీ సీన్లు చూపిస్తూ.. ఆమె మెదడులోని కణితిని విజయవంతంగా తొలగించారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, న్యూరో సర్జరీ విభాగం వైద్య నిపుణులు కలిసి ఈ క్లిష్టమైన ఆపరేషన్ ను పూర్తి చేశారు.

అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేసి కణితిని తొలిగించారు. కాకినాడ జీజీహెచ్ లో ఈ తరహా సర్జరీ ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సర్జరీలో పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు. ఇక ఆపరేషన్ ను విజయంతం చేసి.. రోగిని బతికించిన వైద్యులపై ఆమె బంధువులు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. మరి..ఈ అదుర్స్ ఆపరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet