iDreamPost
android-app
ios-app

తిరుమలలో బూందీ ప్రసాదం లడ్డూగా ఎలా మారిందో తెలుసా? పూర్తి వివరాలివే

  • Published Sep 23, 2024 | 10:13 AM Updated Updated Sep 23, 2024 | 10:13 AM

Tirumala Tirupati Laddu Prasadam History: తరతరాలుగా  తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనానికి తొలి ప్రాధాన్యత తర్వాత ఇస్తూ .. మలి ప్రాధాన్యతగా లడ్డూ ప్రసాదంక ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. అందుకే ప్రతిఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత.. ఆ శ్రీవారికి అత్యంత ప్రీతి అయిన లడ్డూ ప్రసాదం కావాలని తాపత్రయపడుతుంటారు. మరి, అంతటి ప్రసిద్ధిగాంచిన ఈ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విశిష్టత ఏమిటి దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Tirumala Tirupati Laddu Prasadam History: తరతరాలుగా  తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనానికి తొలి ప్రాధాన్యత తర్వాత ఇస్తూ .. మలి ప్రాధాన్యతగా లడ్డూ ప్రసాదంక ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. అందుకే ప్రతిఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత.. ఆ శ్రీవారికి అత్యంత ప్రీతి అయిన లడ్డూ ప్రసాదం కావాలని తాపత్రయపడుతుంటారు. మరి, అంతటి ప్రసిద్ధిగాంచిన ఈ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విశిష్టత ఏమిటి దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Sep 23, 2024 | 10:13 AMUpdated Sep 23, 2024 | 10:13 AM
తిరుమలలో బూందీ ప్రసాదం లడ్డూగా ఎలా మారిందో తెలుసా? పూర్తి వివరాలివే

దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. ఇక్కడ సాక్షత్తు శ్రీ మహా విష్ణువు స్వరూపంగా పిలువబడే ఆ వేంకటేశ్వరస్వామి స్వయుంభువుగా వెలిశాడు. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని కలియుగ వైకుంఠం అని అంటారు. అందుకే నిత్యం దేశం నలువైపులా నుంచి లక్షలాది మంది భక్తులు ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా కొండకు తరలి వెళ్తుంతుంటారు. ఇకపోతే ఈ తిరుమల కొండపైనున్న ఈ వెంకన్న స్వామికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆయన తర్వాత.. లడ్డూ ప్రసాదం కూడా తిరుమల్లో అంతే ప్రసిద్ధిగా నిలిచింది.

అయితే  తరతరాలుగా  తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనానికి తొలి ప్రాధాన్యత తర్వాత ఇస్తూ .. మలి ప్రాధాన్యతగా లడ్డూ ప్రసాదంక ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. అందుకే ప్రతిఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత.. ఆ శ్రీవారికి అత్యంత ప్రీతి అయిన లడ్డూ ప్రసాదం కావాలని తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో నిల్చుంటారు. మరి, అంతటి ప్రసిద్ధిగాంచిన ఈ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విశిష్టత ఏమిటి దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుమల లడ్డూ ప్రసాదం చరిత్ర:

తిరుమలలో ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదం వెనుక చరిత్ర ఏమిటంటే.. క్రీ.శ.1444లో సంవత్సరంలో తిరుమలలోని శ్రీవారికి సుఖీయం నైవెద్యంగా సమర్పించేవారు. ఆ తర్వాత క్రీ.శ.1455లో అప్పం, క్రీ.శ.1461లో వడ, క్రీ.శ.1469లో అత్తిరసం పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామి వారికి నివేదించేవారు.  అది కాస్త క్రీ.శ.1480లో మనోహరం పేరుతో తీపి పదార్థన్ని నైవేద్యంగా స్వామి వారికి సమర్పించడం జరిగింది. ఇదే కాలక్రమంగా క్రి.శ. 1804 సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పాలించే ఈస్టిండియా కంపెనీ హయాంలో శనగపిండి పాకంతో తయారుచేసిన బూందిని ప్రసాదంగా వినియోగించే ఆచారం ప్రారంభమైంది. అదే భక్తులకు ప్రసాదంగా పంచేవారు. కానీ, కాలక్రమంలో ఈ తీపి ప్రసాదమైన బుంది రూపంతారం చెంది లడ్డూగా తయారైనట్లు తెలుస్తోంది. అది కూడా క్రీ.శ. 1943 సంవత్సరంలో రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది.

Tirumala Laddu

 అయితే మొట్ట మొదటిసారిగా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో 195ం సంవత్సరంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ లడ్డూను తయారుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. ఇక దీనికి కొలమానంగా ఒక పడి అని నిర్ణయించారు. అయితే ఇక్కడ పడి అంటే.. 51 లడ్డూలని అర్ధం.  ఇలా కాలక్రమంలో తిరుమలలో పెరుగతు వస్తున్న  రద్దీ కారణంగా.. అనేక పడులు పెంచుకుంటూ వచ్చి, చివరికి అనుసరిస్తున్న పడితరం స్కెల్ ఏదైతే ఉందో.. 2001 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు బోర్డులో  తీసుకున్న నిర్ణయంమే ఇప్పట్టికి అక్కడ  అనుసరిస్తున్నారు. అయితే అక్కడ 51 లడ్డూ తయారు చేయడానికి, శ్రీవారి ఊగ్రణం అంటే.. స్టోర్ అక్కడ నుంచి విడిగా వస్తువులను పోర్ట్ కి తరలిస్తారు.

అనగా.. నెయ్యి, బెల్లం, శనగపప్పు, ఎలాకులు, ఎండు ద్రాక్ష ఇలాంటివన్నీ ఒక కొలమానంగా తీసుకొనం ప్రకారం తీసుకొని, ముందు బుందిగా తయారు చేసి, ఆ తర్వాత దానిని లడ్డూగా మలుస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రతిరోజు ఉదయం ఆ శ్రీవారికి మొదటి గంటలో నైవెద్యంగా పెట్టి, ఆనంతరం దానిని తీసుకువచ్చి మిగతా లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులకు ప్రసాదంగా అందించడం జరుగుతుంది. అయితే శ్రీవారి లడ్డూల్లో కూడా మూడు రకాల ప్రసాదాలు ఉంటాయి. ఒకటి కల్యాణ లడ్డు, దానినే పెద్ద లడ్డూ అంటారు. రెండోవది ఆస్థానం లడ్డూ, ఇంకోటి చిన్న లడ్డూ అంటారు. ఆ చిన్న లడ్డునే భక్తులకు విడిగా తిరుమలలో అందిస్తుంటారు. అయితే ఎక్కువ శాతం చిన్న లడ్డూనే స్వామి వారికి నైవెద్యంగా సమర్పింస్తుంటారు.  కాగా, ఈ లడ్డూ ప్రసాదాన్ని తిరుమలలో వైష్ణవ స్వాములు తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

తిరుమల స్వామి వారికి ఎన్ని ప్రసాదాలు ఉంటాయి?

ఇక తిరుమలలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు 51 ప్రసాదాలు వివిధ రూపాల్లో  స్వామి వారికి సమర్పిస్తారు. వీటిలో ప్రత్యకమైన స్థానం పొందినది మాత్రం లడ్డూ, వడ. ఇక అన్న ప్రసాదానికి వస్తే.. ఉప్పు పొంగలి, చక్ర పొంగలి, దద్దోజనం, పొలిహోర, కదంబం, దోసలు, అప్పలు, పెద్ద లడ్డూలు, చక్ర యాలకులు, , సీర, మొలహోర తోమాలను, నువ్వులు ప్రసాదం, వీటన్నింటితో పాటు ప్రతి ఆదివారం స్వామివారికి అమృత కలశా అనే ప్రసాదం సమర్పిస్తారు. దీనిని గరూడ ప్రసాం అంటారు. వీటతో పాటు పలు పండ్లను కూడా తిరుమల శ్రీవారికి ప్రసాదంగా సమర్పిస్తారు.