iDreamPost
android-app
ios-app

ఏపీ, తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

  • Published Sep 18, 2024 | 8:51 AM Updated Updated Sep 18, 2024 | 8:51 AM

IMD Yellow Alert Issued to Ap, Telangan: గత రెండు నెలల నుంచి దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజల జీవితం అతలాకుతలం అవుతుంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇప్పట్లో వర్షాలు తగ్గేలా లేవని వాతావరణ శాఖ వెల్లడించింది.

IMD Yellow Alert Issued to Ap, Telangan: గత రెండు నెలల నుంచి దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజల జీవితం అతలాకుతలం అవుతుంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇప్పట్లో వర్షాలు తగ్గేలా లేవని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీ, తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీ, తెలంగాణ చిగురుటాకులా వణికిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో బుడమేరు వాగుతో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఎండలు కొట్టడంతో తేరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మళ్లీ బాంబు పేల్చింది. మరో రెండు రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, వాయువ్య దిశగా గాలులు విస్తున్నాయని.. వీటి ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు హైదారాబాద్ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురువనున్నాయని.. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, జిగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని..  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ఇక ఏపీ విషయానికి వస్తే.. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ప్రస్తుతం డెహ్రాడూన్, ఒరై మీదుగా జార్ఖండ్, గోపాల్‌పూర్ లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది.ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం లో బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. బలమైన ఉపరితల గాలులు గంటకు సుమారు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, పార్వతీపురం, అ్లలూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.