iDreamPost
android-app
ios-app

APSDPS: రాత పరీక్ష లేకుండానే స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు!

  • Published Sep 17, 2024 | 10:06 PM Updated Updated Sep 17, 2024 | 10:06 PM

APSDPS: ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS) గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.. ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (SVMU) ఔట్‌ సోర్సింగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది..

APSDPS: ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS) గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.. ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (SVMU) ఔట్‌ సోర్సింగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది..

APSDPS: రాత పరీక్ష లేకుండానే స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు!

మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం కావాలా? అయితే ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.. APSDPS లో ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (SVMU) ఔట్‌ సోర్సింగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది.. ఈ నోటిఫికేషన్‌ లో మొత్తం 24 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవడానికి ఆసక్తి ఇంకా ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు? ఇంకా పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మేంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలు విషయానికి వస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కచ్చితంగా ఎంబీఏ పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభం కూడా ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక అభ్యర్ధుల వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి జనవరి 01, 2025 నాటికి 40 ఏళ్ల కంటే మించకూడదు.ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులకు విద్యార్హతలతో పాటు ఆర్గనైజేషనల్‌ స్కిల్స్ కూడా కచ్చితంగా ఉండాలి. ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌, డిజిటల్‌ కమ్యునికేషన్‌ టూల్స్‌ గురించి బాగా తెలిసి ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో పట్టు ఉండాలి. ముఖ్యంగా ఆ భాషల్లో మాట్లాడటం రాయడం తెలిసి ఉండాలి.

లీడర్‌షిప్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ కలిగి ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. వీటిని ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు సెప్టెంబర్‌ 28 (సాయంత్రం 5 గంటలలోపు) దాకా ఉంటుంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ రౌండ్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇక ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ఏకంగా రూ.60,000 జీతం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారు విజయవాడలో పనిచేయవల్సి ఉంటుంది. కాబట్టి ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 28 లోపు అప్లై చేసుకోండి. ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS) విడుదల చేసిన ఈ పోస్టులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobet giriş