ఇవాళ టాలీవుడ్ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నానితో జరిగిన చర్చలు పూర్తయ్యాయి. కొన్ని కీలకమైన అంశాలు డిస్కస్ చేసినట్టు తెలిసింది. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది ఇండస్ట్రీలోనూ చర్చకు దారి తీసింది. 200 కోట్లని 600 కోట్లని పోస్టర్లలో కలెక్షన్లను పబ్లిసిటీ చేయడం సహజమేనని, అంత మాత్రాన అవి నిజంగా వచ్చినట్టు భావించకూడదని చెప్పి షాక్ ఇచ్చారు. అలా కేవలం కొన్ని […]
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఒక వెబ్ సైట్ తయారు చేయమని ఆదేశాలు జరీ చేస్తూ దానికి బాద్యులుగా కొందరు సభ్యులతో కూడిన కమిటీ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇది ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుతున్న పరిమాణం. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ చేస్తున్న అడ్డగోలు దోపిడీకి ఇన్నాళ్లు అలవాటు పడిన ఆడియన్స్ వేరే మార్గం లేక వాటిని భరిస్తూ వచ్చారు. ఒక టికెట్ […]
సినిమా టికెట్ల ధరలు, సెకండ్ షోల వ్యవహారం, అదనపు షోల అనుమతులు వగైరా ఇష్యూల మీద ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు సిద్ధమవుతున్నారు. చిరంజీవి నేతృత్వంలో ఒక బృందం సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి కార్యాలయంలో కలుసుకోబోతున్నట్టు సమాచారం. ఆ మేరకు మంత్రి పేర్ని నాని నుంచి అప్ డేట్ వెళ్లిందని ఫిలిం నగర్ న్యూస్. అయితే ఎవరు వెళ్తారు అనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు, […]
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లకు అనుమతులు జారీ చేసింది. ముందు నుంచి ఊహించినట్టే సగం సీట్ల కండీషన్ మాత్రం కొనసాగుతుంది. శానిటైజేషన్ లాంటి నిబంధనలన్నీ యథావిథిగా కొనసాగనున్నాయి. కాకపోతే సెకండ్ షోలకు మాత్రం అవకాశం లేదు. వ్యాపార లావాదేవీలు ఏవైనా సరే 10 లోపే మొత్తం పూర్తి చేయాలి. సో రాత్రి పూట ఆటలు ఇప్పట్లో చూడటం కల్లే, ఇక తెలంగాణ కూడా గత నెలే ఓకే అన్నప్పటికీ కొంత స్పష్టత మిస్ […]
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పిల్లల ప్రాణాల మీద, వారి భవిష్యత్తు మీద మమకారం, బాధ్యత ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నామని.. […]