iDreamPost
android-app
ios-app

మహిళల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు.. చదువు అక్కర్లేదు.. ఈజీగా జాబ్ కొట్టొచ్చు

AP KGBV Non Teaching Recruitment 2024: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. విద్యార్హతతో సంబంధం లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

AP KGBV Non Teaching Recruitment 2024: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. విద్యార్హతతో సంబంధం లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

మహిళల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు.. చదువు అక్కర్లేదు.. ఈజీగా జాబ్ కొట్టొచ్చు

ఉద్యోగం ఏదైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. ప్రభుత్వ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించాలంటే కనీసం డిగ్రీ అయినా ఉండాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా విద్యార్హతలకు తగిన జాబ్స్ ఉంటాయి. ప్రభుత్వ కొలువులు సాధించాలి అంటే పోటీపరీక్షలను ఎదుర్కోవాలి. మంచి ప్రతిభ కనబర్చాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలను ఫేస్ చేయాలి. అన్ని దశల్లో ప్రతిభ చూపితే తప్పా గవర్నమెంట్ ఉద్యోగం వరించదు. ఈ రోజుల్లో ఉద్యోగాలు సాధించడం గగనమైపోయింది. కాంపిటీషన్ హెవీగా ఉంది. ఇక ప్రైవేట్ రంగంలో స్పెషల్ స్కిల్స్ ఉంటే తప్పా ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగలేని పరిస్థితి. అందుకే ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉండాలంటుంటారు కెరీర్ నిపుణులు.

మరి ఇలాంటి తరుణంలో అసలు చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం పొందే అవకాశం వస్తే అంతకు మించిన ఆనందం మరోటి ఉండదు కదా. మహిళల కోసం విద్యార్హత లేకున్నా ప్రభుత్వ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. ఉన్న ఊరిలో జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వార్యంలో నిర్వహించే కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2024-25 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి 729 బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.

హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే/నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్, చౌకీదార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 15వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను మంండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్, స్వీపర్ పోస్టులకు విద్యార్హతలు తప్పనిసరి కాదని ప్రకటనలో తెలిపారు.

డే/నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు 7వ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు వయోపరిమితికి వయస్సు రికార్డు షీట్/టీసీ/ఆధార్ కార్డు తప్పనిసరి. అభ్యర్థుల వయసు 42ఏళ్లకు మించకూడదు. కేజీబీవీలు ఉన్న ప్రాంతంలో నివసించే వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఆ తర్వాత అదే మండలంలో నివసిస్తున్న వారికి సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్య్వూ లేకుండానే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు 15 వేల జీతం అందిస్తారు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం  ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.