P Krishna
Heavy Rain for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమైంది..ఏపీకి మరో తుఫాన్ పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rain for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమైంది..ఏపీకి మరో తుఫాన్ పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
P Krishna
ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు విజయవాడ చిగురుటాకులా వణికిపోయింది. బుడమేరు వాగు పొంగిపొర్లడంతో పలు కాలనీలు మొత్తం నీటమునిగిపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికీ ఆ ఛాయలు ఇంకా వీడిపోలేదు. ఏపీలో మళ్లీ టెన్షన్ మొదలైంది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. శనివారం దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు మొత్తం మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 14 నుంచి 16 వరుకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ఏపీ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అల్ప పీడనం ఏర్పడితే తుఫాన్ పై మరింత క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి ఏపీలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. పల్నాడు, శ్రీ సత్యసాయి, ఏలూరు, ప్రకాశం, పవ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ప్రకాశం, కర్నూల్, తూర్పు గోదావరి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అరేబియా సముంద్రంలో ఏర్పడిన అల్ప పీడనం బలపడింది. కర్ణాటక, గోవా తీరాల సమీపంలో కేంద్రీకృతమై ఉంది.. ఇది వాయువ్య దిశగా కదులుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 17న ఏపీలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గత నెలలో వచ్చిన తుఫాన్ ప్రభావం నుంచి ఇంకా ఏపీ ప్రజలు కోలుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఏకంగా మూడు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని తెలియగానే తమ పరిస్థితి ఏంటా అని భయంతో వణికిపోతున్నారు.ఏపీ విజయవాడలో బుడమేరు వాగు, తెలంగాణ ఖమ్మంలో జిల్లాలో మున్నేరు వాగు పొంగి పొర్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.