iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉంటే చాలు.. ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు

Union bank free training: మహిళలకు యూనియన్ బ్యాంక్ తీపికబురును అందించింది. తెల్ల రేషన్ కార్డ్ ఉంటే చాలు ఇంటి వద్ద ఉండే సంపాదించుకునే ఛాన్స్ కల్పిస్తోంది.

Union bank free training: మహిళలకు యూనియన్ బ్యాంక్ తీపికబురును అందించింది. తెల్ల రేషన్ కార్డ్ ఉంటే చాలు ఇంటి వద్ద ఉండే సంపాదించుకునే ఛాన్స్ కల్పిస్తోంది.

మహిళలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉంటే చాలు.. ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు

ప్రస్తుత రోజుల్లో ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, జబ్బు చేస్తే ఆసుపత్రి బిల్లులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చిన్న చిన్న పనులు చేసే వారు, చిరుద్యోగులు చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వారికి వచ్చే తక్కువ ఆదాయంతో ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేయాలిన ఆలోచిస్తున్నారు. సెకండ్ ఇన్ కమ్ కోసం అందుబాటులో ఉన్న మార్గాలను వెతుకుతున్నారు. అయితే కొన్ని స్వచ్చంద సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఆదాయాన్ని పొందేలా కృషి చేస్తున్నాయి.

మరి మీరు కూడా మంచి ఆదాయాన్ని కోరుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు ఇంటి వద్ద నుంచే సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది. మహిళలు, యువతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగం, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు ఇదొక గొప్ప సువర్ణావకాశం. ప్రముఖ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. చంద్రగిరిలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మహిళలకు బ్యూటీపార్లర్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. తెల్ల రేషన్ కార్డ్ కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి 30 రోజుల పాటు ఈ ఉచిత ట్రైనింగ్ కొనసాగనుంది.

ఈ మేరకు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని గ్రామీణ యువతులు, మహిళలకు ఈ అవకాశం కల్పించారు. ఈ రెండు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతులు, మహిళలు అర్హులు. అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ట్రైనింగ్ సమయంలో వీరికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. అలాగే వచ్చీపోయేందుకు ఒక ఛార్జీ డబ్బులు సైతం ఇస్తారని ప్రకటనలో తెలిపారు. నెలరోజుల ట్రైనింగ్ పూర్తైన తర్వాత బ్యూటీపార్లర్ కోర్సులో సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు.

బ్యూటీపార్లర్ ఉచిత శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటుగా.. పాస్‌పోర్టు ఫోటోలతో పేర్లు నమోదు చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ప్రకటనలో తెలిపింది. ట్రైనింగ్ పూర్తైన తర్వాత అందించే సర్టిఫికేట్ ద్వారా స్వయంగా ఉపాధి పొందవచ్చని సూచించింది. ఇప్పుడు అంతా అందానికి ప్రియారిటీ ఇస్తున్నారు. బ్యూటీ పార్లర్స్ కు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి మీరు ఈ కోర్స్ పూర్తి చేసినట్లైతే ఇంటి వద్ద ఉండే సంపాదించుకోవచ్చు.

ఇంటి వద్దనే బ్యూటీ పార్లర్ సెంటర్ ను ఓపెన్ చేసి ఉపాధి పొందొచ్చు. బ్యూటీపార్లర్ తో మహిళలకు ఆదాయం పక్కా అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న మహిళలు, యువతులు యూనియన్ బ్యాంక్ అందించే బ్యూటీపార్లర్ కోర్స్ ఫ్రీ ట్రైనింగ్ ను యూజ్ చేసుకుని మీ కాళ్లమీద మీరు నిలబడండి. మరి బ్యూటీపార్లర్ ఉచిత ట్రైనింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.