iDreamPost
android-app
ios-app

కొడుకులా చూసుకుంటే.. కాలయముడయ్యాడు.. CI తల్లి హత్య కేసు పూర్తి వివరాలివే

కొడుకు దూరంగా ఉండటంతో ఎదురింట్లో ఉంటున్న అబ్బాయిని కుమారుడిగా భావించింది. అన్ని అతడితో పంచుకుంది. కానీ చివరకు అతడే కాలమయుడయ్యాడు.

కొడుకు దూరంగా ఉండటంతో ఎదురింట్లో ఉంటున్న అబ్బాయిని కుమారుడిగా భావించింది. అన్ని అతడితో పంచుకుంది. కానీ చివరకు అతడే కాలమయుడయ్యాడు.

కొడుకులా చూసుకుంటే..  కాలయముడయ్యాడు.. CI తల్లి హత్య కేసు పూర్తి వివరాలివే

కొడుకు ఉద్యోగ విధుల్లో భాగంగా దూరంగా ఉండటంతో.. తన ఇంటికి ఎదురుగా ఉన్న అబ్బాయిలో తన కుమారుడ్ని చూసుకుంది స్వర్ణకుమారి. మంచి, చెడు, ఫ్యామిలీ విషయాలు అన్ని పంచుకుంది. తన బాధ, ఆనందాన్ని పంచుకునేందుకు కొడుకు దొరికాడంటూ సంబరపడిపోయిందా తల్లి. కానీ అతడు మాత్రం అన్నం పెట్టిన చేయినే నరికేశాడు. నమ్మించి నట్టేట ముంచాడు. అమ్మలా ప్రేమను పంచిన ఆమెనే అంతమొందించాడు. ధర్మవరం ఒకటో పట్టణ సీఐగా పనిచేస్తున్న నాగేంద్ర ప్రసాద్ తల్లి హత్య ఉదంతం ఇది. కొడుకు లాంటి వాడని నమ్మిన వ్యక్తే యమజాతకుడయ్యాడు. బంగారు నగల కోసం తల్లిలాంటి ఆమెను హత్య చేశాడు.  ఇలాంటి దారుణ సంఘటనలు చూస్తుంటే..  బయట వ్యక్తుల్ని నమ్మలేని పరిస్థితి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మదనపల్లె పట్టణంలోని జగన్ కాలనీకి చెందిన స్వర్ణకుమారికి కొడుకు నాగేంద్ర ప్రసాద్ ఉన్నాడు. భర్త రెండో పెళ్లి చేసుకుంటే.. అతడితో విడిపోయి.. కొడుకును కష్టపడి చదివించింది తల్లి. నాగేంద్ర ప్రసాద్ కూడా తల్లి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. హాకీ క్రీడాకారుడిగా సత్తా చాటడంతో పాటు డిగ్రీ పూర్తి చేశాడు. క్రీడల కోటాలో ఎస్.ఐగా ఎంపికయ్యారు. గతంలో అనంతపురం జిల్లాలో పనిచేసిన నాగేంద్ర ప్రసాద్.. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఒకటో పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టాడు. కొడుక్కి ట్రాన్స్ ఫర్ కావస్తుండటంతో సిటీలో ఉన్న ఇల్లు పాడువుతుందని అక్కడే ఉండిపోయింది స్వర్ణకుమారి. వీరి ఇంటికి ఎదురుగా  వెంకటేశ్ కుటుంబం నివసిస్తుంది. వెంకటేశ్ గతంలో స్వర్ణ కుమారికి తెలిసి ఉండటంతో మాటలు పెరిగాయి. ఆమె తన కొడుకులా చూసుకుని, ఇంట్లో కావాల్సిన సరుకులు తెప్పించుకునేది.

స్వర్ణ కుమారికి కాస్తంత అనారోగ్య సమస్యలు ఉండటంతో ప్రతిదీ వెంకటేశ్‌కు చెప్పి.. చేయించుకనేది. కానీ అతడు మాత్రం ఆమె నగలపై కన్నేశాడు. ఆమె అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని తన స్నేహితుడు అనిల్‌తో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశాడు. కాశీ నుండి స్వామీజీ వచ్చాడని, అతని వద్ద చూపించుకుంటే ఎలాంటి రోగాలైనా మటుమాయం అవుతాయని స్వర్ణ కుమారిని నమ్మించాడు. వీరి మాటలు నమ్మి వెళ్లింది స్వర్ణ కుమారి. తీర్థం తాగాలంటూ మత్తుమందు కలిపిన నీరు తాగించారు.  ఆమె మత్తులో ఉండగానే సుత్తితో తలపై కొట్టి చంపేశారు. అనంతరం ఆమె వద్ద నగలు తీసుకుని తాకట్టు పెట్టి.. రూ. 4.30 లక్షలు తీసుకున్నాడు.

తిరిగి వచ్చి గోనె సంచిలో ఆమె మృతదేహాన్ని ఉంచి ఓ స్మశాన వాటిలో సమాధిని తవ్వి అందులో పడేసి వెళ్లిపోయాడు. స్వర్ణ కుమారి కుమారుడు నాగేంద్ర ప్రసాద్.. తన తల్లి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టగా.. ఈ మధ్య కాలంలో ఆమె సన్నిహితంగా మెలిగిన వెంకటేశ్ అని తేలింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు. కాగా, మరో నిందితుడు అనిల్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ హత్య కేసులో అనిల్ తల్లి ప్రమేయం ఉందని భావించి.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిలా చూసుకున్న ఆమెను హత్య చేసిన ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.