Keerthi
Devara Moive: ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా దేవర హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా దేవర మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి సమయంలో తాజాగా దేవర సినిమాకు ఊహించని చుక్కెదురైంది. ముఖ్యంగా రిలీజ్ కు ముందే నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాలేంటో చూద్దాం.
Devara Moive: ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా దేవర హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా దేవర మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి సమయంలో తాజాగా దేవర సినిమాకు ఊహించని చుక్కెదురైంది. ముఖ్యంగా రిలీజ్ కు ముందే నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాలేంటో చూద్దాం.
Keerthi
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్,దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు దేవరని తెరపై చూస్తమనని రోజులు కౌంట్ చేసుకుంటున్నారు. అయితే ఎట్టాకేలకు ఆ రోజు రానే వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సెప్టెంబర్ 27వ తేదీన దేవర మూవీ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే.. ఏ థీయేటర్స్ లో చూసినా ఎన్టీఆర్ దేవర బ్యానర్స్, కటౌట్స్ తో అంతా సందడి వాతవరణం కనిపిస్తుంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాకు టికెట్స్ పెంపుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రత్యేక షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేవర సినిమాకు ఊహించని చుక్కెదురైంది. ముఖ్యంగా రిలీజ్ కు ముందే నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాలేంటో చూద్దాం.
ఇటీవలే ఏపీలోని హై కోర్టు ఎన్టీఆర్ దేవర మూవీ టికెట్ ధరలను మొదటి 14 రోజులు అధికంగా అమ్మేలా జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఆ పిల్ పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది. దేవర మూవీ టికెట్ ధరలను పెంపు అనేది 10 రోజులకు మాత్రమే పరిమొతం చేయాలని ఏపీ హైకోర్ట్ ఆదేశించింది. ఈ మేరకు హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచటానికి 10 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని కమిటీ రిపోర్ట్ ఉందని పిటిషనర్ వాదనలు వినిపించాడు. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దేవరకు మొదటి 10 రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే.. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ.135 కాగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై రూ.60 వరకూ పెంచారు.
ఇదిలా ఉంటే.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. దేవర నిర్మాతలకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. ఇకపోతే తెలంగాణాలో మొదటి రోజు మాత్రం ఒకరేటు, మిగిలిన 9 రోజులు మరొక రేట్ కు టికెట్ ధరలు నిర్ణయించింది. అయితే రెండవ రోజు నుండి ఇచ్చిన రేట్స్ ను మరి కొంత పెంచమని తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మతలు మరోసారి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. మరి, రిలీజ్ కు ముందే దేవర మూవీకి ఏపీ హై కోర్టు ఇచ్చిన షాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.