iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ నెలలో బోలెడన్నీ సెలవులు

అక్టోబర్ నెల వచ్చిందంటే విద్యార్థులకు సెలవులే సెలవులు. దసరా హాలీడేస్ రావడంతో రియల్ పండుగ చేసుకుంటున్నారు. కానీ ఈ అక్టోబర్ నిరుడు లెక్క కాదు.. ఈ సారి డబుల్ ధమాకా అందిస్తోంది.

అక్టోబర్ నెల వచ్చిందంటే విద్యార్థులకు సెలవులే సెలవులు. దసరా హాలీడేస్ రావడంతో రియల్ పండుగ చేసుకుంటున్నారు. కానీ ఈ అక్టోబర్ నిరుడు లెక్క కాదు.. ఈ సారి డబుల్ ధమాకా అందిస్తోంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ నెలలో బోలెడన్నీ సెలవులు

సెప్టెంబర్‌కు బైబై చెప్పేసి.. అక్టోబర్‌లోకి అడుగుపెట్టేశాం. అక్టోబర్ వచ్చిందంటే ఉద్యోగులకు, సామాన్యులకు జస్ట్ తేదీలు మారతాయి అంతే.. కానీ విద్యార్థులకు దసరా హాలీడేస్ గుర్తుకువస్తుంటాయి. మే సమ్మర్ సెలవులు మినహాయించి.. సంక్రాంతి, దసరా హాలీడేస్ కోసమే స్టూడెంట్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఓ వైపు పరీక్షల ఒత్తిడి ఉన్నా.. వారం, పది రోజుల పాటు వచ్చే హాలీడేసే వారికి ఇంపార్టెంట్. పుస్తకాలను అటకెక్కించి.. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చని సంబరపడిపోతుంటారు. ఆట పాటల్లో మునిగి తేలిపోవాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు.. అలాగే ఉద్యోగులకు కూడా పండుగ సెలవులు ఎలాగో ఉండనున్నాయి. అయితే ఈ సారి అక్టోబర్ నెల నిరుడు లెక్క ఉండదు.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతుంది.  భారీగా హాలీడేస్ రాబోతున్నాయి. మరీ ఈ అక్టోబర్ నెలలో ఎన్ని సెలవులు రాబోతున్నాయో ఓ లుక్కేయండి.

అక్టోబర్ నెలలో విద్యార్థులకు సెలవులే సెలవులు. దసరా మాత్రమే కాదు.. ఈసారి దీపావళి కూడా ఈ నెలలోనే రాబోతుంది.  నెల మొదలు నుండి ఎండింగ్ వరకు బోలెడన్నీ ఎంజాయ్ డేస్ వస్తున్నాయి. గాంధీ జయంతి మొదలుకుని, దీపావళి వరకు సెలవులు  చాలా రాబోతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఏపీలో ఇంచుమించు ఒకేలా సెలవులు ఉండబోతున్నాయి. ఈ రెండు పండుగుల దృష్ట్యా అక్టోబర్ నెలలో ఏకంగా స్కూల్స్ 16 రోజుల పాటు మూతపడనున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి. విద్యార్థులతో పాటు ఉద్యోగులకు హాలీడేస్. అక్టోబర్ 2 నుండే తెలంగాణలో దసరా సెలవులు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్. అక్టోబర్ 13 వరకు సెలవులు ఉండనున్నాయి. అంటే 12 రోజులు విద్యార్థులకు పండగో పండుగ. ఏపీలో అక్టోబర్ 3 నుంచి 14 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు దసరాకు రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 12న దసరా అంటే శనివారం వచ్చింది.. అక్టోబర్ 13న ఆదివారం. అలా రెండు రోజులు కలిసి వచ్చింది.

కాగా, ఇదే నెలలో దీపాల పండుగ కూడా రాబోతుంది. ఈ నెల ఆఖరున అంటే అక్టోబర్ 31న దీపావళి పండుగ రాబోతుంది. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉంటాయి. ఉద్యోగులకు కూడా ఈ హాలీడే వర్తిస్తుంది. కొన్ని విద్యా సంస్థలు ముందు రోజు అంటే అక్టోబర్ 30న కూడా సెలవులు ఇస్తాయి. ఇది కేవలం ఆప్షనల్ హాలీడే మాత్రమే. 20, 27 తేదీల్లో ఆదివారాలు రాబోతున్నాయి. ఈ మొత్తం కలుపుకుని అక్టోబర్‌లో స్కూల్ పని దినాలు కేవలం 14 రోజులు మాత్రమే. ఈ లెక్కన విద్యార్థులకు అసలు సిసలైన పండుగ వార్త అంటే ఇదే కదూ. ఇక తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. అటు ఏపీలో అక్టోబర్ 3 నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పండుగతో రెండు రాష్ట్రాలు కళకళలాడబోతున్నాయి.  విద్యార్థులకు సెలవును తెచ్చిపెట్టాయి.