iDreamPost
android-app
ios-app

APకి తుఫాను దెబ్బ.. ఆ జిల్లాలో భారీ వర్షాలు తప్పవు!

  • Published Oct 14, 2024 | 11:14 AM Updated Updated Oct 14, 2024 | 11:14 AM

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ పై మరోసారి తుఫాన్ గతంలో లాగానే మళ్ళీ తీవ్ర ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ పై మరోసారి తుఫాన్ గతంలో లాగానే మళ్ళీ తీవ్ర ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

APకి తుఫాను దెబ్బ.. ఆ జిల్లాలో భారీ వర్షాలు తప్పవు!

ఆంధ్ర ప్రదేశ్ పై మరోసారి తుఫాన్ విజృంభించనుంది. గతంలో లాగానే మళ్ళీ తీవ్ర ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. అది కచ్చితంగా తుఫానుగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీని కారణంగా అక్టోబర్ 18 దాకా ఆంద్ర ప్రదేశ్ లో కుండపోతగా వర్షాలు కురుసే ఛాన్స్ ఉంది. బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అందువలన ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ తుఫాను ప్రభావం ఏఏ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుతం బంగాళాఖాతం ఉప్పొంగిపోతుంది. బంగాళా ఖాతంలో ఉన్న ఆవర్తనం క్రమ క్రమంగా చాలా వేగంగా బలపడుతోంది. ఈ రోజు ఏదొక సమయంలో కచ్చితంగా అల్పపీడనంగా మారే అవకాశం పుష్కలంగా ఉందని వాతావరణ శాఖ అధికారుల నుంచి సమాచారం అందుతోంది. అసలు దీనికి కారణం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటమే అని తెలుస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతానికి అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందు వలన అల్పపీడనం మరింత తీవ్రమవుతుంది. అది కచ్చితంగా తుఫానుగా మారే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు తెలుపుతున్నారు. అందుకే రాబోయే ఈ మూడు రోజులు కూడా ప్రజలు బయటకి రాకపొడమే మంచిది అంటున్నారు అధికారులు. ముఖ్యంగా దసరా సెలవులకి వచ్చిన వారు తిరుగు ప్రయాణాలు చేయకుంటే మంచిది అని సూచిస్తున్నారు అధికారులు.

ఇక బంగాళా ఖాతమే కాదండోయ్ .. మరోవైపు అరేబియా సముద్రంలో కూడా అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతుంది. ఈ వాయుగుండం ప్రభావం అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే తమిళనాడుతో పాటు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలపై కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువలన వాతావరణ శాఖ తమిళనాడులోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అలాగే రాయలసీమకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నాడు ఆంద్ర ప్రదేశ్ లోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలలో అతి భారీగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఇక బుధవారం నాడు రాష్ట్రంలోని బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ ఇంకా నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ వర్షాలు అక్టోబర్ 18 దాకా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ముందుగానే సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులని అలర్ట్ చేశారు. వారు ఎట్టి పరిస్థితిలో కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అలాగే కచ్చితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల వలన వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు అధికారులు. మరి ఈ తుఫాన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.