iDreamPost
android-app
ios-app

’’వన్ టు సిక్స్”.. నంబర్లు కాదు.. కొడుక్కి వినూత్నంగా పేరు పెట్టిన తండ్రి

సమాజంలో కుల, వర్ణ వివక్షత రూపుమాపేందుకు ఎంతో మంది చిరు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వినూత్న ప్రయోగమే ఈ వన్ టు సిక్స్. ఇది ఏంటీ అనుకుంటున్నారా..?

సమాజంలో కుల, వర్ణ వివక్షత రూపుమాపేందుకు ఎంతో మంది చిరు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వినూత్న ప్రయోగమే ఈ వన్ టు సిక్స్. ఇది ఏంటీ అనుకుంటున్నారా..?

’’వన్ టు సిక్స్”.. నంబర్లు కాదు.. కొడుక్కి వినూత్నంగా పేరు పెట్టిన తండ్రి

మానవులంతా ఒకటే అని తెలిసినా.. మనిషికి మనిషిని దూరం చేస్తున్నాయి కులం, మతం అనే సంకెళ్లు. దీనికి డబ్బు కూడా జత కలుస్తుంది. కులం, మతం పేరుతో గోడలు కట్టుకుంటున్నారు. దీని వల్ల కోట్లాటలు, దారుణ హత్యలు, అవమానాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కులం అనే కుంపటిలో కాలిపోయిన జీవితాలెన్నో. కాస్ట్ వల్ల సమాజంలో ఎంతో మంది వర్ణ వివక్షకు, చిన్నచూపుకు గురౌతున్నారు. కొంత మంది మానసికంగా, శారీరకంగా క్రుంగుబాటుకు లోనవుతున్నారు. దీనికి కామా, ఎండ్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొంత మంది ఈ వివక్షతను రూపుమాపేందుకు వినూత్న, వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కులం, మతం అనేది మనం పెట్టుకున్నవే.. మానవులంతా ఒక్కటే అని చాటేచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటిదే ఈ తండ్రి చేసిన ప్రయత్నం కూడా.

కుల, మతాలు లేని మెరుగైన సమాజాన్ని అందించాలని తన కొడుక్కి వినూత్నంగా నామకరణం చేశాడు ఓ తండ్రి. వన్ టు సిక్స్ అని నామకరణం చేశాడు. వన్ టు సిక్స్ అంటే ఏవో నంబర్లు అనుకుంటున్నారేమో.. దాని వెనుక గూడార్థం ఉంది. ఈ సమాజంలో మార్పు కోసం ప్రయత్నించిన అతడి ఎవరంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సీహోచ్ రాఘవేంద్ర. నామకరణమే కాదు.. బర్త్ సర్టిఫికేట్, ఆధార్ లాంటి అన్ని ధ్రువ పత్రాల్లోనూ తన కొడుకు పేరును వన్ టు సిక్స్ అనే పేరును నమోదు చేయించాడు. ఇందులో “వన్” అంటే ఐ, “టూ” అంటే యామ్, “సిక్స్” అంటే ఇండియన్ అని అర్ధం వచ్చేలా తన కుమారుడికి ఆ పేరు పెట్టాడు. తన కొడుకుపై కులం, మతం అనే వివక్ష పడకుండా దూరంగా ఉంచేందుకు ఈ చిరు ప్రయత్నం చేశాడు. ఈ నేమ్ ఫిక్స్ చేయడానికి బలమైన నేపథ్యమే ఉంది.

చదువుకునే రోజుల్లో కల మత బేధాలు లేవని, కానీ పెరుగుతున్న కొద్దీ ఆ భావన చూశానని అన్నాడు. సమాజంలో కొంత మార్పు తెచ్చేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశానని, మనుషులంతా ఒక్కటే అని చెప్పేందుకు ఇలా తన కొడుక్కి నామకరణం చేసినట్లు చెప్పాడు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ వంటి ధ్రువపత్రాల్లోనూ ఇదే పేరును రిజిస్టర్ చేయించానని చెప్పాడు రాఘవేంద్ర. కొంత మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు మెచ్చుకుంటున్నారు. నాన్న అంటే ఇలానే ఉండాలి అని, గ్రేట్ ఫాదర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొడుక్కి బంగారం లాంటి భవితవ్యం ఇవ్వాలని తాపత్రయ పడుతున్న తండ్రి రాఘవేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.