iDreamPost
android-app
ios-app

ఏలూరులో కిలాడీ లేడీ… మాయలో పడ్డారంటే.

యూనియన్ బ్యాంకులో మేనేజర్. కస్టమర్లతో మంచి కాంటాక్టులు. కానీ బుద్ది వంకర. మోసాలకు తెరలేపింది. చివరకు ఉద్యోగం ఊడిపోయింది. కానీ

యూనియన్ బ్యాంకులో మేనేజర్. కస్టమర్లతో మంచి కాంటాక్టులు. కానీ బుద్ది వంకర. మోసాలకు తెరలేపింది. చివరకు ఉద్యోగం ఊడిపోయింది. కానీ

ఏలూరులో కిలాడీ లేడీ… మాయలో పడ్డారంటే.

అందమే ఆమె పెట్టుబడి.. మాయ మాటలతో డబ్బున్న వ్యక్తులను చీట్ చేయడం ఆమెకు అలవాటు. ఆమె హనీ ట్రాప్‌లో పడి ఎంతో మంది బాధితులు అయ్యారు. బయట వాళ్లనే కాదు.. బంధువులను కూడా చీట్ చేసిన ఘనత ఈ మహిళదే. దీంతో బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి తమ గోడు వెలిబుచ్చుకుంటున్నారు. ఇంతకు ఈ మాయ వనితది ఏ ఊరంటే.. ఏలూరు జిల్లాలోని మరిబందం. బాధితులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. దావులూరి ప్రభావతి అనే మహిళ.. తన మాయ మాటలతో డబ్బున్న వాళ్లను ఎర వేసి ఆస్తులు రాయించుకునేది. తిరిగి వాళ్ల మీదే కేసులు పెట్టి.. కోర్టుల చుట్టూ తిప్పుతోంది ఈ కిలాడీ లేడీ.

మరిబందం ప్రాంతానికి చెందిన ప్రభావతి.. బాగా చదువుకుంది. యూనియన్ బ్యాంకులో మేనేజర్ గా పని చేసేది. కానీ కస్టమర్లను చీటింగ్ చేయడంతో పాటు బ్యాంకులో ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో ఆమెను ఉద్యోగం నుండి తీసేశారు అధికారులు. ఇక అప్పటి నుండి మోసం చేయడమే ప్రవృత్తిగా మలుచుకుంది. మేనమామ వరుసయ్యే సుజయ్ రాజ్ కుటుంబాన్ని మోసం చేసింది. అతడి అమ్మను ప్రార్థనల పేరిట మరో ప్రాంతానికి తీసుకెళ్లి.. మాయమాటలు చెప్పి.. రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లింది. తమ ఆస్తులు అమ్ముకుంటున్నామని, సుజయ్ తల్లి పేరు మీద భూమిలో 5 సెంట్లు తన పేరు మీద మార్పించుకుంది. చివరకు అమ్మేందుకు ప్రయత్నించగా.. సుజయ్ అతడి సోదరులు అడ్డుకున్నారు. కానీ మాయ చేసి అమ్మేశారు. 5 సెంట్లపైనే కాదు.. మిగిలిన భూమిపై కూడా కన్నేసి, కోర్టు చుట్టూ తిప్పుతున్నట్లు వాపోయాడు సుజయ్. భూమే కాదు కారు కూడా తీసుకుని ఇవ్వడం లేదంటూ ఆవేదన చెందుతున్నాడు.

ఇవే కాదు గతంలో కూడా ఆమె చేసిన కిలాడీ పనులకు బయట పెట్టాడు సుజయ్. గతంలో ఓ యువకుడి నుండి రూ. 38 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని, మ్యాగీ అనే యువకుడ్ని కూడా ఇలాగే చేసిందన్నాడు. ఏమన్నా అంటే.. అధికారంలో ఉన్న వ్యక్తులు తనకు తెలుసునంటూ బెదిరించేదన్నాడు. అంతేకాదు.. ఆమె చుట్టూ పక్కల వాళ్లతో ఎప్పుడు నిత్యం గొడవలు పెట్టుకుంటుందట. చాలా మంది ఆమె హనీ ట్రాప్ లో  చిక్కుకున్నారు. ఆమెపై చాలా కేసులు ఉన్నాయి. ప్రభావతిని ఎవరైనా ప్రశ్నిస్తే రేప్ కేసు పెడతానని, ఆ మంత్రి తెలుసు, ఈ రౌడీ షీటర్ తెలుసు అంటూ బెదిరిస్తుందని వాపోతున్నారు బాధితులు. నూజివీడులో ఆమెపై రౌడీ షీటర్ ఉంది. ఆమెపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, ఇప్పటి వరకు ఆరు కేసులు ఉన్నాయని నూజివీడు పోలీసులు చెబుతున్నారు. ఆమె నుండి రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కుతున్నారు.