ఇరాన్ డైరెక్టర్ మాజిద్ మజిది తీసిన ‘Children of Heaven’, ‘The Songs of Sparrows’ గానీ ‘Miracle in Cell No. 7’ అనే టర్కీ సినిమా గానీ చూశాక చిన్న పిల్లలతో తీసే సినిమాల్లో అంత డ్రామా ఉంటుంది, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది కదా మరి మన వాళ్లు ఎందుకు అలాంటి సినిమాలు తియ్యట్లేదు అనిపించేది. దానికి సమాధానమేనేమో ఈ ‘Pahuna’. నేపాల్ లోని హిమాలయ పర్వత సానువుల్లో ఒక అందమైన కుగ్రామం మీదుగా […]
ఆకలి గొన్న పులి పంజా దెబ్బకు విలవిల్లాడిన లేడి పిల్లలా కళ్లు మూసి తెరిచేలోపు అన్నమయ్య కట్ట తెగిన అర్ధగంటకల్లా జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. ఇక మిగతాదంతా కళ్లముందు జరిగిన నష్టమే .అది ప్రాణ రూపంలోనా, ఆస్థి రూపంలోనా మరో రూపంలోనా. చెయ్యేటికి వరద వస్తోందని అందరూ చెబుతుంటే ఎలా ఉంటుందో చూద్దామని రైల్వే బ్రిడ్జి మీదకు వెళ్లిన ఒక అబ్బాయి మాటల్లో చెప్పాలంటే ‘అది వరదలా కాదు కోరలు చాచి ముందుకురికిన జల ప్రళయమే’. […]
పోలికలో కొంచెం అతిశయం ఉండొచ్చేమో గానీ పచ్చటి అడవికి శ్వేత వర్ణ మేఘాలు నల్లటి దుప్పటి కప్పగా ఆ దుప్పటి నుంచి చాటుగా తలలు బయటికి పెట్టి నవ్వుతూ పలకరించే చెట్లను, లోయల మీదుగా రివ్వున వీస్తూ ఆ లాలనలో సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నాయా అన్నట్టు మైమరిపించే కొండ గాలులను, మా సంగీత ఝరిని విని తరించమంటూ గల గల దూకుతూ ప్రకృతి సంగీతాన్ని ఆలపించే అజ్ఞాత జలపాతపు సవ్వడులను, వీటన్నింటితో పాటు ఆ నిశ్శబ్ధ క్షణాన […]
దిగువ మందపల్లె పల్లెనీ పొలాల్ని నేలమట్టం చేసిన వరద చెయ్యేరు పాపరాజుపల్లె దగ్గర కొంచెం శాంతించింది. శాంతించడమంటే జాలిపడి కాదు అవకాశం లేక. ఆ ఊరు ఏటిని ఆనుకునే ఉన్నప్పటికీ కొంచెం గట్టుమింద ఉంది. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి ఇంట్లో సామాన్లు, ఇతర సామాగ్రిని ముంచెత్తింది గానీ ప్రాణ నష్టం ఏమీ లేదు. దిగువనున్న రెండు ఇళ్లులు మాత్రం పునాదులతో పెకిలించబడ్డాయి. పొలాలు లేవు కాబట్టి పంట నష్టం కూడా పెద్దగా లేదు. ఆ తర్వాత భీమేశ్వరాలయ […]
ఎగువ మందపల్లెలో ఇరవై ముప్పై ఇళ్లను, పదుల సంఖ్యలో మనషులను, వందలాది పశువులను తనలో కలిపేసుకుని తదుపరి నువ్వేనంటూ దిగువ మందపల్లె వైపుగా సాగింది ఉగ్ర చెయ్యేరు విధ్వంసం. రెండు పల్లెల మధ్య కోతకు సిద్ధంగా ఉన్న వరి మాగానిని మొత్తం వేర్లతో సహా పెకిలించి ఒకప్పుడు ఇక్కడ పొలాలుండేటియి అనేంతగా గెట్లె గెనాలను సదరం చేసింది. అప్పటికే అధికారుల తాలూకు హెచ్చరికలతో పులపత్తూరు, ఎగువ మందపల్లెలో జరిగిన విధ్వంసంతో కొంతలో కొంత అప్రమత్తమయ్యి ప్రాణాలను అరచేతపట్టుకుని […]
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆవేశంతో అన్నమయ్య డ్యాం కట్టలు తెంచుకోగానే తొలిగా గుట్టమింద ఉండే యాకిరెపల్లె ఆనవాళ్లను మొత్తం సదరం చేసింది చెయ్యేరు. తర్వాత సృష్టి స్థితిలయ కారుడైన శివయ్యకే సవాలు విసిరి పాలేశ్వరం గుడి ఆనవాళ్లే లేకుండా పెకిలించివేసింది. ఆ తర్వాత చెయ్యేటి ధాటికి విలవిల్లాడింది పులపత్తూరు. చెయ్యేటి మీదుగా సూర్యోదయం, శేషాచలం కొండల మీదుగా సూర్యాస్తమయాన్ని చూస్తూ పచ్చని పైరుల మీదుగా వచ్చే పిల్లగాలుల లాలనలో సేదతీరే నూట యాభై కుటుంబాల పులపత్తూరు మొత్తం జలమయం […]
విశాఖ కార్తె చిత్తడికి తడిసి, కార్తీక మాసపు చలిలో మత్తుగా జోగుతున్న చెయ్యేటి నదీ ప్రాంతపు పల్లెల్లో తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ప్రళయకల ఘంటికలా ఉయ్యంటూ మోగింది పెద్ద సైరన్. ఎప్పుడో మూగోబోయినట్టు ఉండే అన్నమయ్య ప్రాజెక్టు వరద తాలూకు అలారం అది. కొత్త తరం వాళ్లు పెద్దగా వినుండరు గానీ పెద్దోళ్లు మాత్రం ఈ ముప్పై నలభయ్యేళ్లలో ఒకట్రెండు సార్లు వినుంటారు. గొడ్డుబోయిన గేదెలా తెల్లటి ఇసుకతో ఎండమావుల్లా కనిపించే మన చెయ్యేటికి వరదేందిలేబ్బా అని […]
ఒక నవల సినిమాగా రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలానే వచ్చేవి గానీ ఈ మధ్య ఆ ప్రవాహం కొంచెం తగ్గింది అంతే. ఆ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ ఆ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత నవీన్ గారు రాసిన అంపశయ్య నవల ఆధారంగా ప్రకాశ్ జైనీ దర్శకత్వంలో క్యాంపస్ అంపశయ్య అనే సినిమా వచ్చింది. ఇంకా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలా ఎందుకని సినిమా దర్శక, నిర్మాతలను అడిగితే నవల […]
అడవుల మీద ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని వెతుకుతున్న నాకు ఈ ‘చంద్రగిరి శిఖరం’ అనే పుస్తకం కనపడింది. బెంగాళీ నవలకు తెలుగు అనువాదం. రచయిత బిభూతిభూషన్ బంధోపాధ్యాయ అని ఉంది. రచయిత గురించిన సమాచారంలో పథేర్ పాంచాలి, వనవాసి అనే ఇతర నవలలు కూడా రాశాడంట. అప్పటికి నాకు ఈ రచయిత గురించి గానీ అతని శైలి గానీ తెలియదు. ఏమైతే ఏమిలే అని లోగిలి వెబ్ సైట్లో ఆర్డర్ పెట్టా. ఎందుకో మరి బుక్ […]
మా పల్లెల్లో పెంచలకోన అంటే అదొక క్రేజ్. ఎందుకు ఆ క్రేజ్ అంటే ఏ ఆటోకు చూసినా పెంచల నరసిహస్వామి సర్వీస్ అనో లేక దీవెనలతో అనో రాసుకుంటుంటారు. అదే కాక ఏప్రిల్, మే నెలల్లో పెంచల తిరునాల చూడ్డం కోసమే వెళ్లి వచ్చినవారు “అబ్బబ్బ ఏం జరిగిందిలే కాళ్లు పెట్టడానిగ్గూడా సందులేదు” అని చెప్పే మాటలు అదనం. గూగుల్ లో ఫోటోలు వెతికితే పచ్చని ప్రకృతి మధ్య ఉండడంతో వెళ్లాలి వెళ్లాలని అనుకుంటుండేవాడిని. నిన్న మోక్షం […]