అంతర్జాతీయ క్రికెట్ లో టీం ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వచ్చిన తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. 2020-21 ఆస్ట్రేలియా టూర్ తర్వాత మనోడికి క్రేజ్ కూడా బాగా పెరిగింది. గంగూలి నుంచి పూర్తి సపోర్ట్ ఉండటంతో ఆడినా ఆడకపోయినా, క్యాచ్ పట్టినా పట్టకపోయినా సరే టీంలో ధోనీ వారసుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఫాన్స్ అయితే ఇండియా గిల్క్రిస్ట్ అని చెప్పుకోవడం మొదలుపెట్టేశారు. ఏ ఫార్మాట్ అయినా సరే ఊపుడే లక్ష్యంగా బ్యాటింగ్ […]
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణవార్తతో సినీ రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సిఎంలు, పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు, గౌతంరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే పలు అధికారిక, వినోద కార్యక్రమాలను రద్దు చేస్తూ ప్రకటనలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. నేడు నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను […]
బలమైన రాజకీయ కుటుంబం… అధినేత దగ్గర పూర్తి స్వేచ్ఛ, ముఖ్యమంత్రి వద్దకు నేరుగా వెళ్ళే స్వాతంత్ర్యం, సొంత జిల్లాతో పాటుగా రాయలసీమలో బలమైన అభిమాన అనుచరగణం, ప్రత్యర్థులు కూడా ఆప్యాయంగా అన్నా పిలిచే మంచితనం… ఇలా ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా సరే ఒక్క అధినేతకే కాదు సీనియర్లు అందరికి సమానం గౌరవం ఇస్తూ అన్నా అని పిలుస్తూ తనదైన ముద్ర వేసిన గౌతం […]
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణవార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా షాక్ కి గురయ్యారు. ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉండే మంత్రి మరణవార్త నుంచి రాజకీయ ప్రముఖులు కూడా బయటకురాలేదు. దుబాయి పర్యటనకు పెట్టుబడుల కోసం వెళ్ళిన మంత్రి… నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఆయన నేడు ఉదయం కూడా జిమ్ కు వెళ్లినట్టు తెలిసింది. ఆ తర్వాత కాసేపటికి గుండెపోటు రావడంతో వెంటనే […]
తెలంగాణాలో బలపడే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రతీ విషయాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని సున్నితమైన అంశాల ద్వారా… రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి బిజెపి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది తరహాలో తెలంగాణాలో కూడా కొన్ని భావోద్వేగాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు ప్రతిష్టాత్మక మేడారం జాతర మీద బిజెపి నేతలు దృష్టి సారించడం వివాదాస్పదం అవుతుందనే చెప్పాలి. ఎన్నడు లేని విధంగా జాతీయ […]
ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అసోం సిఎం చేసిన విమర్శలు పెద్ద దుమారమే రేపాయి. సర్జికల్ స్ట్రైక్ గురించి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరో మేము అడిగామా అంటూ ఆయన చేసిన కామెంట్స్, ఆయనకు బిజెపి నేతల నుంచి వస్తున్న మద్దతు విమర్శలకు దారి తీసింది. దీనిపై తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా ఘాటుగా స్పందిస్తూ బర్తరఫ్ చేయాలని […]
ఏపీ సిఎం వైఎస్ జగన్ తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కాసేపటి క్రితం భేటీ అయ్యారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఆసక్తికర చర్చ జరగడం, ఇటీవల సినిమా పెద్దలు సిఎం తో భేటీ కావడం… వంటి అంశాల నడుమ ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఇచ్చిన నివేదిక సినిమా పెద్దల భేటీలో చర్చకు వచ్చింది. అటు జగన్ కూడా సినిమా సమస్యల మీద […]
మనదేశంలో సైబర్ నేరాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. చిన్న చిన్న వస్తువుల పేరుతో లక్షలు లక్షలు మోసం చేసే వరకే ఉన్న సంస్కృతి ఇప్పుడు సైబర్ అటాక్ తో ఏకంగా బ్యాంకు లను టార్గెట్ చేసే స్థాయికి వెళ్ళింది. మహేష్ బ్యాంకు వ్యవహారం దెబ్బకు బ్యాంకింగ్ రంగం మొత్తం కంగారు పడింది. తమ వినియోగదారుల భద్రతతో పాటుగా తమ సొమ్ము పై బ్యాంకు లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకు లు అయితే హ్యాకింగ్ నిపుణులను […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బలపడే ప్రయత్నం చేేస్తోంది. ఈ తరుణంలో బిజెపి నేతలు కొన్ని కొన్ని వివాదాస్పద అంశాలను కూడా ప్రస్తావిస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ అనే అంశాన్ని ఏపీ బిజెపి పదే పదే ప్రస్తావించేందుకు సిద్దమవుతోంది. కాపు రిజర్వేషన్ విషయంలో గతంలో టీడీపీ ఇబ్బంది పడింది. రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు చేసిన రాజకీయానికి అటు కాపుల్లో సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. […]
ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసోం సిఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రాహుల్ గాంధీ… రాజీవ్ కొడుకు అని మేము ఋజువు అడగలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. దీనిపై పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు దీనిపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అటు బిజెపి కార్యకర్తలు సైతం కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసారు. ఇక […]