ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కదనే దుగ్ధతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగానూ బద్నాం చేసే పనిలో బాబు బ్యాచ్ ఉంది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏపీలో అప్పులు పెరిగిపోతున్నాయని పచ్చమీడియా సహా అందరూ గగ్గోలు పెడుతుంటారు. కానీ ఏపీలో ఆదాయం పెరుగుతున్నట్టుగా రిజిస్ట్రేషన్ల రాబడి సహా జీఎస్టీ వసూళ్ల వరకూ అనేక అంశాలు రుజువు చేస్తాయి. లెక్కలతో మాకు పనిలేదంటూ, కాకి లెక్కలతోనే ఆ సెక్షన్ గోలపెడుతున్న తీరు విడ్డూరంగా ఉంటుంది. ఆ క్రమంలోనే […]
ఏపీలో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు అంతా రెడీ అయిపోయింది. కొత్త మంత్రుల ఎంపిక ప్రక్రియలో సీఎం తలమునకలై ఉన్నారు. అదే సమయంలో పాత మంత్రులుగా ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుత క్యాబినెట్ గురువారం నాడు చివరి సారి భేటీ కాబోతోంది. ఆ సమావేశంలో సీఎం స్పష్టత ఇవ్వబోతున్నారు. మంత్రివర్గంలో ఉన్న నేతలందరికీ బాధ్యతలు అప్పగించబోతున్నారు. పార్టీ వ్యవహారాల్లో వారందరికీ విధులు కేటాయించి, వాటిని పూర్తి చేయాలని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం […]
ఏపీలో మళ్లీ అధికారంలోకి రాగలమనే ధీమా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తల్లడిల్లిపోతోంది. ఆ క్రమంలో ఏమి చేయడానికైనా సిద్ధమన్నట్టుగా సాగుతోంది. చివరకు రాష్ట్ర పరువుని తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ని అవమానించడానికి కూడా సిద్ధపడిపోతోంది. చంద్రబాబుతో పాటుగా ఆయన పార్టీ నేతల మాటలు చూస్తుంటే రాష్ట్రం మీద వీసమెత్తు ప్రేమ కూడా లేదని అర్థమవుతోంది. తమకు అధికారం లేని రాష్ట్రం అధోగతి పాలుకావాల్సిందేనని ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. వరుసగా టీడీపీ వ్యవహారశైలి దానికి అద్దంపడుతోంది. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి హస్తినలో పర్యటిస్తున్నారు. స్వల్పవ్యవధిలోనే నేరుగా ప్రధాని అపాయింట్ మెంట్ ఆయనకు లభించింది. దాంతో మోడీతో జగన్ భేటీ రాజకీయంగా చర్చకు తెరలేపుతోంది. కీలక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనూహ్యంగా జగన్ ఢిల్లీ పర్యటన ఖరారుకావడం వెనుక కారణాలపై పలు చర్చలు సాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్ధతుని బీజేపీ ఆశించడం ఒకటి. దానికి అనుగుణంగానే పీఎం, సీఎం మధ్య చర్చలు జరుగుతాయని […]
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం చేయలేనిది మూడేళ్లలోపులో జగన్ చేసి చూపించారు. ఒక్క జిల్లా ఏర్పాటు కోసం ప్రయత్నించి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన చంద్రబాబు వెనకడుగు వేశారు. 13 జిల్లాలు సెంటిమెంట్ రీత్యా మంచిది కాదని భావించిన చంద్రబాబే 14 జిల్లాలు చేస్తున్నట్టు ప్రకటించి మళ్లీ వెనక్కి తగ్గారు. కానీ జగన్ అందుకు భిన్నంగా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన మాటకు కట్టుబడి పనిచేశారు. చెప్పిన రీతిలో ప్రతీ పార్లమెంట్ సీటుని ఒక్కో జిల్లాగా మార్చారు. […]
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. రేపటి నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కాబోతోంది. దానికి అనుగుణంగా కొత్త కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి అంకం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చుట్టూ అందరి దృష్టి పడింది. జగన్ చెప్పినట్టుగా తన ప్రభుత్వంలో మూడేళ్ల కాలంలోనే కొత్త జిల్లాలను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తన ఎలక్షన్ క్యాబినెట్ ఎంపిక మీద దృష్టి పెడుతున్నారు. కొత్త జిల్లాల […]
ఆయన గోదావరి జిల్లాల్లోనే బలమైన కాపు కులానికి చెందిన బలమైన నాయకుడు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే పదవులు అనుభవించారు. కానీ చివరకు ఇటీవల ఆయన చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆరంభం నుంచి స్థిరత్వం లేని రాజకీయాలు, అవకాశాలు ఉపయోగించుకోలేని తీరుతో ఆయన తన ప్రాభవాన్ని కోల్పోయారు. దాంతో కొత్తపల్లి సుబ్బారాయుడి రాజకీయ ప్రస్థానంలో కీలక స్థానానికి చేరినప్పటికీ వైకుంఠపాళి మాదిరిగా అనూహ్యంగా పతనాన్ని చవిచూశారు. ప్రస్తుతం జిల్లాల విభజన […]
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ దాదాపు నాలుగేళ్ల కాలం పాటు టీడీపీతో కలిసి సాగింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు అన్ని విధాలుగానూ పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. సరిగ్గా ఆ సమయంలోనే రైతుల రుణమాఫీ సహా అనేక హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. రుణమాఫీ ప్రక్రియనే అపహాస్యం చేశారు. 84 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి దశల వారీగా కేవలం రూ. 14వేల కోట్లను మాత్రమే రైతులకు ప్రయోజనం చేకూర్చిన చంద్రబాబుని […]
ఏపీ బీజేపీలో మొదటి నుంచి చంద్రబాబు అనుకూల వర్గం పెత్తనం చేయాలని చూస్తూ వస్తోంది. కొంతకాలం దానికి అనుగుణంగా వాతావరణం కూడా కనిపించేది. కానీ సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత అందుకు అడ్డంకులు పడ్డాయి. ముఖ్యంగా పలు సందర్భాల్లో సోమ వీర్రాజు బాబు బ్యాచ్ కి చెక్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. ఆఖరికి ఒత్తిడికి తలొగ్గినా తొలుత ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని ఏకంగా బహిష్కరిస్తున్నామనే నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంతో సోము వీర్రాజు అంటే […]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చుట్టూ అర్థసత్యాలతో విషప్రచారానికి పూనుకునే బ్యాచ్ కూడా అంగీకరించాల్సిన సత్యాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ ముందుకుపోతోందని, ఏపీ వెనుకబడిపోతోందంటూ మొసలి కన్నీరుగార్చే సెక్షన్ కి మింగుడుపడని పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి. తెలంగాణాలో కేవలం హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి కేంద్రీకరించబడుతుంటే ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి. 2021-22లో ఏకంగా 35 శాతం అదనంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రావడం అందుకు తార్కాణం. రాజధాని లేని రాష్ట్రం, అమరావతి లేకుండా […]