మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో బాబు భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు నిన్న మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అందరి దృష్టి అటువైపు తిరిగింది . యథావిధిగా దీని వెనక వైసీపీ పెద్దలున్నారని కొన్ని చానెళ్లు నిర్విరామంగా కథనాలు ప్రసారం చేయగా , ప్రజల్లో సానుభూతి కోసం టీడీపీ , అనుకూల మీడియా కలిసి ఆడుతున్న మరో నాటకం అయ్యుండొచ్చని పలువురు విశ్లేషకులు ఈ వార్తని కొట్టిపారేశారు . […]
యధావిధిగా విక్రమార్కుడు చెట్టు పై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొన్నట్టే ఈ ఆదివారం కూడా కొత్తపలుకు పేరిట తాను తీవ్రంగా వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి పై విషం చిమ్మేయత్నం చేశాడు రాధాకృష్ణ . అయితే పల్లవి మారింది . తానేమీ చెప్పినా కంఠశోషగా మిగులుతుందన్న ఉక్రోశంతో కాబోలు ఈ ప్రజల్లో స్పందన లేదూ , పట్టించుకోవట్లేదూ అంటూ సమాజం పై అసహనం వెళ్లగక్కే ప్రయత్నం చేేశాడు . సంక్రాంతి సందర్భంగా గుడివాడలో జరిగిన జూదం , […]
జిల్లాల పునర్విభజనలో భాగంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ, చారిత్రక నేపథ్యంతో ముడిపడిన పల్నాడు పేరుని జిల్లాకు పెట్టిన ప్రభుత్వ నిర్ణయం పట్ల రాజకీయాలకతీతంగా పల్నాడు ప్రాంత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంగా నరసరావుపేటని ఎంపిక చేయడంతో పేట నియోజకవర్గ ప్రజల ఆనందం ఎల్లలు దాటింది. పలు ప్రాంతాల నుండి వచ్చిన డిమాండ్స్ తట్టుకొని నరసరావుపేటని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నరసరావుపేట […]
ప్రాణాలు తీసేసే జిల్లా వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ , వాళ్లకి ప్రాణాలు తీయడం తప్ప ఏమీరాదు : కడపకు ఎయిర్పోర్ట్ ను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు . ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనటం రాజకీయ నాయకులకు పరిపాటే అయినా పదే పదే అదే తీరు ప్రత్యేకంగా ఒక ప్రాంతం పై ఎక్కువగా చూపించటం , అవకాశం చిక్కినప్పుడల్లా విద్వేషం చిమ్మడం మాత్రం కడప పైనే […]
ఎన్టీఆర్ ……. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడిగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకి భారతరత్న ఇవ్వాలని సుదీర్ఘకాలంగా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది . ఎన్టీఆర్ కి ఆ గౌరవం కల్పించే విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని , తనకు అధికారం లేనప్పుడు సానుభూతి కోసం , అధికారంలోకి రావటానికి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్టీఆర్ పేరు వాడుకొని ఇలాంటి డిమాండ్స్ చేయటమే తప్ప నిజానికి […]
పార్లమెంట్ కేంద్ర స్థానమైన నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సున్నితమైన పల్నాడు ప్రాంత నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్స్ పట్ల బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శించకుండా , ప్రాంతీయ వివాదాలు రేకెత్తకుండా సంయమనం పాటిస్తూ రెండు శతాబ్దాల పై చరిత్ర గల నరసరావుపేట భౌగోళికంగా పార్లమెంట్ స్థానం లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆరు నియోజక వర్గాలకు సమదూరంలో కేంద్ర స్థానంగా ఉండటంతో పాటు , నేషనల్ , స్టేట్ హైవేలకు దగ్గరగా అన్ని […]
పుట్టపర్తి … ఒక ప్రాంతంగా కన్నా అశేష జనవాహిని అభిమానం చూరగొన్న శ్రీ సత్యసాయి బాబా పేరులో భాగంగానే బహిరంగ ప్రపంచానికి పరిచయం అయిన పేరు పుట్టపర్తి .ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని కలిగి ఉన్న సత్యసాయిబాబా తనకున్న అభిమాన బలాన్ని పుట్టపర్తి ప్రాంత అభివృద్ధికి ఆలంబనగా మలిచారు . అంతే కాక పూర్తి వెనుకబాటు ప్రాంతమైన పుట్టపర్తి నియోజకవర్గం పలు విధాల అభివృద్ధి చెందటానికి కారణమైన శ్రీ సత్యసాయి పేరుని జిల్లా పేరుగా నిర్ణయించాలని […]
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల పైనే సమయం ఉన్నా రాష్ట్రంలో కొన్నిచోట్ల టీడీపీ వేడి రగిల్చే ప్రయత్నం చేస్తోంది . ఈ క్రమంలోనే పుట్టపర్తిలో కూడా సవాళ్ళతో వేడిరగిల్చే ప్రయత్నం చేశారు టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి . పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్థానికుడు కాదంటూ కొత్త ఆరోపణలు చేశారు పల్లె . ఈ అంశం పై స్పందించిన దుద్దుకుంట తాను స్థానికుణ్ణి కాదని నిరూపిస్తే తనకున్న ఐదొందల కోట్ల ఆస్తిని […]
పల్నాడులో పట్టు పెంచుకోవడం కోసం టీడీపీ హత్యా రాజకీయాలు , దుష్ప్రచారం , అల్లర్లు దారిగా ఎంచుకుందా .. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ఓటమి పాలైన టీడీపీ నాటి నుండి అధికార వైసీపీ పై అసహనంతో ఏదోక రూపంలో ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది . అంతేగాక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే నిశ్చయంతో ఉన్న బాబు ఇప్పటినుండే నియోజక వర్గాల వారీగా బలహీనంగా ఉన్న చోట్ల కొత్త అభ్యర్థులను ఇంచార్జ్ […]
ఇటీవల వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది . పల్నాడు పల్లెల్లో గత పదిహేనేళ్ల కాలంగా చల్లారిన ఫ్యాక్షన్ గొడవలు ఈ అమానుష హత్యతో మళ్లీ చెలరేగుతాయేమోనన్న అనుమానంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది . హత్య వెనకున్నది వైసీపీ నేతలేనని టీడీపీ నాయకులు పలువురు ఆరోపించారు . హత్య జరిగిన వెంటనే తీవ్రంగా స్పందించిన చంద్రబాబు ఇది వైసీపీ ప్రభుత్వ హత్యగా వర్ణించడంతో పాటు మృతుని అంత్యక్రియల […]