iDreamPost
android-app
ios-app

అదనపు రేట్లు లేకపోయినా.. రాజాసాబ్ నెగ్గుకురాగలడా !

  • Published Dec 17, 2025 | 11:30 AM Updated Updated Dec 17, 2025 | 11:30 AM

ప్రభాస్ సినిమా అంటేనే భారీ సెట్ లు , భారీ బడ్జెట్ లు , భారీ వసూళ్లు. ఆ కట్ అవుట్ కు తగినట్టు అన్నీ అలా భారీగానే ఉంటాయి. తక్కువలో కానిచ్చేద్దాం అని అనుకున్నా సరే మొదలు పెట్టిన తర్వాత.. అది అలా పెరిగిపోతూ ఉంటుంది. మారుతి ప్రభాస్ కాంబినేషన్ అని అనౌన్స్ చేసినపుడు ఇది మీడియం రేంజ్ మూవీ అనే చాలా మంది అనుకున్నారు.

  • Published Dec 17, 2025 | 11:30 AMUpdated Dec 17, 2025 | 11:30 AM
అదనపు రేట్లు లేకపోయినా.. రాజాసాబ్ నెగ్గుకురాగలడా !

ప్రభాస్ సినిమా అంటేనే భారీ సెట్ లు , భారీ బడ్జెట్ లు , భారీ వసూళ్లు. ఆ కట్ అవుట్ కు తగినట్టు అన్నీ అలా భారీగానే ఉంటాయి. తక్కువలో కానిచ్చేద్దాం అని అనుకున్నా సరే మొదలు పెట్టిన తర్వాత.. అది అలా పెరిగిపోతూ ఉంటుంది. మారుతి ప్రభాస్ కాంబినేషన్ అని అనౌన్స్ చేసినపుడు ఇది మీడియం రేంజ్ మూవీ అనే చాలా మంది అనుకున్నారు. డార్లింగ్ మిర్చి లాంటి వింటేజ్ ప్రభాస్ ను మారుతి చూపిస్తాడని.. ఇది చాలని అనుకున్నారు. మారుతి కూడా తనకు బాగా అలవాటైన హర్రర్ కామిడి జానర్లో సినిమాను తీశాడు. అయినాసరే అది 400 కోట్ల వరకు దాటిపోయింది.

సినిమాలో ఎక్కువగా భారీ విజువల్స్ , భారీ సెట్స్ , ఎక్కడో విదేశాల్లో షూటింగ్ , భారీ తారాగణం ఇలా ఒకదానికి ఒకటి తోడై బడ్జెట్ లిమిట్ దాటిపోయింది. కట్ అవుట్ ప్రభాస్ ది కాబట్టి రికవరీ ఈజీగానే అయిపోతుడనే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే డార్లింగ్ సినిమా అంటే బయ్యర్స్ పోటీ పడి మరీ కొంటారు. ప్రస్తుతానికి రాజాసాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.200 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు టాక్ వినిపిస్తుంది. ఆంధ్రలో రూ.85 కోట్లు, రాయలసీమలో రూ.40 కోట్లు, నైజాంలో రూ.70 కోట్లు పెట్టి రైట్స్ తీసుకుంటున్నారట.

ఇంతవరకు బాగానే ఉంది. సోలో రిలీజ్ అయ్యి ఉంటె సాధారణ టికెట్ రేట్స్ అయినాసరే రికవరీ ఈజీగానే ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ లో అఖండ 2 చిత్రానికి రేట్స్ పెంచడంపై కేసులు పడ్డాయి. సో ఈ సినిమాకు టికెట్ హైక్స్ ఉంటాయా లేదా అనేది డౌట్ ఏ. పైగా సంక్రాంతికి చాలా గట్టి పోటీ ఉంది. ప్రేక్షకులకు ఆప్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇక అదనపు రేట్లు లేకపోయినా రాజాసాబ్ నెగ్గుకురాగలడా లేదా అనేది తెలియాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.