Swetha
ఇంకొద్ది రోజుల్లో సోషల్ మీడియా అంతా రాజాసాబ్ ఆక్రమించేసుకుంటుందేమో. ఎందుకంటే సినిమా రిలీజ్ కు పట్టుమని నెల రోజుల సమయం కూడా లేదు. ఈలోపే సినిమా నుంచి రావాల్సిన ప్రమోషనల్ కంటెంట్ అంతా రావాలి , ఓ ట్రైలర్ రావాలి. మూవీ టీం మాత్రం ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు లేదు

ఇంకొద్ది రోజుల్లో సోషల్ మీడియా అంతా రాజాసాబ్ ఆక్రమించేసుకుంటుందేమో. ఎందుకంటే సినిమా రిలీజ్ కు పట్టుమని నెల రోజుల సమయం కూడా లేదు. ఈలోపే సినిమా నుంచి రావాల్సిన ప్రమోషనల్ కంటెంట్ అంతా రావాలి , ఓ ట్రైలర్ రావాలి. మూవీ టీం మాత్రం ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు లేదు . ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాస్త టెన్షన్ లో కూడా ఉన్నారు.
ఇక సినిమా బిజినెస్ కూడా అదే లెవెల్ లో జరిగిందట. డార్లింగ్ నటించిన మొదటి హర్రర్ సినిమా కాబట్టి ఇంకాస్త ఎక్కువ డీలింగ్స్ ఏ జరుగుతున్నట్టు టాక్ . . తెలుగు రాష్ట్రాల్లో ‘ది రాజా సాబ్’ థియేట్రికల్ బిజినెస్ రూ.160 కోట్ల మేరకు జరిగినట్టుగా తెలిసింది. క ఓవర్సీస్, హిందీ వెర్షన్ మార్కెట్ కలిపి రూ.350 కోట్లు బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. అలా మొత్తం మీద నాన్ థ్రియేట్రికల్ రైట్స్‌తో కలిపి మొత్తం బిజినెస్ రూ.600 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో టార్గెట్ భారీగానే ఉంది. సంక్రాంతిలో మిగిలిన సినిమాలు వచ్చేలోపు.. రాజాసాబ్ ఎంత రాబట్టలో అంత రాబడితే ప్రాబ్లమ్ ఉండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .