Swetha
ఎస్ఎస్ రాజమౌళికి , హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. చాలా సంధర్భాల్లో తానూ రాజమౌళి తీసిన బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలని చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అలాగా అతను తీసిన అవతార్ : ఫైర్ అండ్ యాష్ సినిమాను రాజామౌళితో సహా కొంతమంది ప్రముఖులను పిలిచి చూపించారు
ఎస్ఎస్ రాజమౌళికి , హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. చాలా సంధర్భాల్లో తానూ రాజమౌళి తీసిన బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలని చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అలాగా అతను తీసిన అవతార్ : ఫైర్ అండ్ యాష్ సినిమాను రాజామౌళితో సహా కొంతమంది ప్రముఖులను పిలిచి చూపించారు
Swetha
ఎస్ఎస్ రాజమౌళికి , హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. చాలా సంధర్భాల్లో తానూ రాజమౌళి తీసిన బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలని చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అలాగా అతను తీసిన అవతార్ : ఫైర్ అండ్ యాష్ సినిమాను రాజామౌళితో సహా కొంతమంది ప్రముఖులను పిలిచి చూపించారు. ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా రాజమౌళితో మాట్లాడుతూ.. వారణాసి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అందరికంటే ముందు చూడటం ఎంతో సంతోషంగా ఉంది. మూవీలో విజువల్స్ తీర్చిదిద్దిన తీరు అద్భుతం. మూవీ చూస్తున్నప్పుడు థియేటర్‌లో చిన్న పిల్లాడిలా అయిపోయాను. అవతార్ ఫ్రాంఛైజీ సిల్వర్ స్క్రీన్ కి ఒక బెంచ్ మార్క్’’ అని జక్కన్న చెప్పారు. తర్వాత కామెరూన్ వారాణసి షూటింగ్ చూడాలని ఉందని చెప్పగా.. ‘మీరు వస్తే మా ‘వారణాసి’ టీమ్ మాత్రమే కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీ థ్రిల్ అవుతుంది’ అని రాజమౌళి బదులిచ్చారు.
చాలా కాలం నుంచి షూట్ చేస్తున్నారు అనుకుంటా కదా అంటే అందుకు ఏడాది నుంచి షూట్ చేస్తున్నాం సర్ ఇంకో ఏడెనిమిది నెలలలో షూట్ పూర్తవుతుంది అని రాజమౌళి తెలిపారు. మీరు ఏదన్నా మంచి ఫన్ గా పులులు లాంటి వాటితో ఫన్ చేస్తే ఖచ్చితంగా చెప్పండి కలుద్దాం అంటూ జేమ్స్ కామెరూన్ తెలిపారు. అలా కాసేపు వీరిద్దరి మధ్య ముచ్చట్లు జరిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dear @JimCameron, we’d be honoured to host you on the #VARANASI sets sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/seIp1yXzYX
— Varanasi (@VaranasiMovie) December 17, 2025