Swetha
బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2. ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ కు , సినీ క్రిటిక్స్ కు ఎలా ఉందొ తెలియదు కానీ బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం విపరీతంగా నచ్చేసింది. కానీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురీదుతున్న మాట వాస్తవం. కొన్ని ఏరియాల్లో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ అవ్వడం కాస్త అనుమానంగానే ఉందని అంటున్నారు.

బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2. ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ కు , సినీ క్రిటిక్స్ కు ఎలా ఉందొ తెలియదు కానీ బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం విపరీతంగా నచ్చేసింది. కానీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురీదుతున్న మాట వాస్తవం. కొన్ని ఏరియాల్లో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ అవ్వడం కాస్త అనుమానంగానే ఉందని అంటున్నారు. సరే ఇదంతా తేలడానికి ఇంకొక వారం రోజులు సమయం పడుతుంది.
అయితే ఇది కాకుండా ఇప్పుడు సినిమా లవర్స్ , బాలయ్య అభిమానుల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. బోయపాటి కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుంచి చేసినవన్నీ కూడా మాస్ కథలే. హీరో ఎలాంటివారైనా సరే బోయపాటి మాత్రం మాస్ గానే చూపిస్తారు. ఇక సింహ , లెజెండ్ లాంటి సినిమాలు బోయపాటికి ఇంకాస్త హై కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. దీనితో వినయ విధేయ రామ లో కాస్త ఎలివేషన్స్ ఎక్కువ అవ్వడంతో దెబ్బ తింది. ఆ తర్వాత అఖండ తో కం బ్యాక్ ఇచ్చారు. కానీ మళ్ళీ స్కంద తో ఇంకో దెబ్బ తగిలింది.
ఇక ఇప్పుడు అఖండ 2 తో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు బోయపాటి. కానీ అది ఫ్యాన్స్ వరకే పరిమితం అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది. సో ఇప్పుడు బోయపాటి తన స్టయిల్ ను మార్చుకోవాలనే విషయం అఖండ 2 గుర్తుచేసింది. కేవలం ఎలివేషన్స్ తో ఎక్కువ కాలం నెట్టుకురావడం కష్టం. దానితో పాటు కథనం కథ అన్నీ బావుండాలి. ప్రస్తుతం బోయపాటి చేతిలో ఎలాంటి సినిమా లేదు. . గీతా ఆర్ట్స్ బ్యానర్ తో ఓ కమిట్మెంట్ ఉందని అన్నారు. అది కూడా బాలకృష్ణ తోనే అనే ప్రచారంలో ఉంది. సో ఇక బోయపాటి ఏమి చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.