iDreamPost
android-app
ios-app

డిఫరెంట్ గా ఉన్న డెకాయిట్ టీజర్

  • Published Dec 18, 2025 | 3:05 PM Updated Updated Dec 18, 2025 | 3:05 PM

అడవి శేష్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు . తీసింది కొద్దీ సినిమాలే అయినా అతను చూస్ చేసుకునే కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అయితే అడవి శేష్ తెర మీద కనిపించి రెండేళ్లు గడిచిపోయింది. మొన్నీమధ్యనే వచ్చిన హిట్ 3 ది థర్డ్ కేస్ లో క్యామియో చేశాడు. కానీ అడవి శేష్ అభిమానులకు ఇది సరిపోలేదు.

అడవి శేష్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు . తీసింది కొద్దీ సినిమాలే అయినా అతను చూస్ చేసుకునే కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అయితే అడవి శేష్ తెర మీద కనిపించి రెండేళ్లు గడిచిపోయింది. మొన్నీమధ్యనే వచ్చిన హిట్ 3 ది థర్డ్ కేస్ లో క్యామియో చేశాడు. కానీ అడవి శేష్ అభిమానులకు ఇది సరిపోలేదు.

  • Published Dec 18, 2025 | 3:05 PMUpdated Dec 18, 2025 | 3:05 PM
డిఫరెంట్ గా ఉన్న డెకాయిట్ టీజర్

అడవి శేష్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు . తీసింది కొద్దీ సినిమాలే అయినా అతను చూస్ చేసుకునే కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అయితే అడవి శేష్ తెర మీద కనిపించి రెండేళ్లు గడిచిపోయింది. మొన్నీమధ్యనే వచ్చిన హిట్ 3 ది థర్డ్ కేస్ లో క్యామియో చేశాడు. కానీ అడవి శేష్ అభిమానులకు ఇది సరిపోలేదు. డెకాయిట్ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఏమో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. పైగా సినిమాలో హీరోయిన్ ను సైతం ఛేంజ్ చేసిన సంగతి తెలియనిది కాదు. దీనితో షూట్ ఇంకాస్త ఆలస్యం అయింది. ఇక ఇప్పుడు అంతా సర్దుబాటు చేసుకుని టీజర్ ని రిలీజ్ చేశారు.

కాన్సెప్ట్ ఏంటో చెప్పి చెప్పనట్టుగా చెప్పేసారు. ఓ దొంగ దోపిడీలు చేసి జైలుకు వెళ్లడం అతని అది చాలా మామూలు విషయం. ఈ క్రమంలో అతని చేతికి ఓ ప్రమాదకరమైన మిషన్ వస్తుంది. ఆ ప్రయాణంలో మృణాల్ పరిచయం అవుతుంది. ఈ ఇద్దరు కలిసి శత్రువులను తప్పించుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. మరో వైపు పోలీసులు వీరిని వెతుకుతూ ఉంటారు. అసలు అక్కడ ఏమి జరుగుతుంది ? వారి మధ్య ఏమైనా ప్రేమ కథ కూడా జరుగుతుందా ? అసలు ఈ కథేంటి అనేది తెలుసుకోవాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

ఇక టీజర్ లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. నాగార్జున హలో బ్రదర్ లోని చార్ట్ బస్టర్ సాంగ్ కన్నెపిట్టరో కన్నుకొట్టరో పాటని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో రీమిక్స్ చేసి వాడటం. ఇది కాస్త డిఫరెంట్ గా అనిపించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కూడా మంచి పాత్రలు పోషించారట. ఈ సినిమాను 2026 మార్చి 19 న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.