Swetha
అనిల్ రావిపూడి , చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కచ్చితంగా చిరు కి ఇది సెకండ్ ఇన్నింగ్స్ మంచి సినిమా అవుతుందని అంతా అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్.
అనిల్ రావిపూడి , చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కచ్చితంగా చిరు కి ఇది సెకండ్ ఇన్నింగ్స్ మంచి సినిమా అవుతుందని అంతా అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్.
Swetha
అనిల్ రావిపూడి , చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కచ్చితంగా చిరు కి ఇది సెకండ్ ఇన్నింగ్స్ మంచి సినిమా అవుతుందని అంతా అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్. ఆయన డైరెక్షన్ లో ఏ హీరో సినిమా తీసిన కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ ఏ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా జనవరి 12న రాబోతుంది. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి.. మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన క్యామియో దాదాపు 20 నిమిషాల పాటు ఉండబోతుందట. ఓ సాంగ్ , ఓ ఫైట్ , కొన్ని కామిడి సీన్స్ లో వెంకటేష్ కనిపించబోతున్నారట. రీసెంట్ గానే వెంకటేష్ కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఇందులో ఓ ఐదు నిమిషాల పాటు చిరంజీవి , వెంకటేష్ ల మధ్య ఓ హిలేరియస్ ఎపిసోడ్ షూట్ చేశారట. అందులో చిరు , వెంకీ సంభంధించిన పాటలను మెడ్లిగా వినిపించబోతున్నారట.
సో ఈసారి మన శంకర వర ప్రసాద్ గారు బాగానే హంగామా చేసేలా ఉన్నారు. ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొదట కాస్త నెగిటివిటి వచ్చినా రీల్స్ రూపంలో అందరు ఆ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రాబోయే క్రిస్మస్ సంధర్బంగా ఇంకో సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారట. న్యూ ఇయర్ కి బహుశా ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.