Swetha
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్స్ ఏమి కొత్త కాదు. తెలుగులో అయితే మహానటి సావిత్రి బయోపిక్ తర్వాత ఈ క్రేజ్ ఇంకాస్త పెరిగిపోయింది. ప్రస్తుతం ఇది ట్రెండ్ అయింది. ప్రముఖుల జీవితాలను సినిమాల రూపంలో అందరికి తెలియజేస్తున్నారు. వీటిలో కొన్ని బయోపిక్స్ ఊహించని రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్స్ ఏమి కొత్త కాదు. తెలుగులో అయితే మహానటి సావిత్రి బయోపిక్ తర్వాత ఈ క్రేజ్ ఇంకాస్త పెరిగిపోయింది. ప్రస్తుతం ఇది ట్రెండ్ అయింది. ప్రముఖుల జీవితాలను సినిమాల రూపంలో అందరికి తెలియజేస్తున్నారు. వీటిలో కొన్ని బయోపిక్స్ ఊహించని రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్ రానుందట. ఆ బయోపిక్ మరెవరిదో కాదు ప్రఖ్యాత గాయని ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారిది.
ఈ బయోపిక్ లో లీడ్ రోల్ లో నటించేందుకు సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘రామాయణ్’లో సీతగా నటిస్తుంది సాయి పల్లవి . ఆ తర్వాత లుగు బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తీయబోయే ఓ బయోపిక్‌లో నటించబోతుందనే రూమర్ ఆ మధ్య గట్టిగా వినిపించింది. బహుశా ఆ బయోపిక్ ఇదేనేమో.. మళ్లీ రావా, జెర్సీ, కింగ్డమ్ లాంటి సినిమాలు తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది.
ఆ మధ్య ఈ బయోపిక్ లో కీర్తి సురేష్ నటించబోతుందని టాక్ కూడా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సాయి పల్లవి అనే వార్త వైరల్ అవుతుంది. ఇక త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఒకవేళ తీస్తే మాత్రం అందులో ఏమేమి అంశాలు చూపిస్తారు అనేది తెలియాల్సి ఉంది . ఎందుకంటే ఎం ఎస్ సుబ్బలక్ష్మి అంటే కేవలం సింగర్ మాత్రమే కాదు.. ఆమె అంతకుమించిన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.